🙏🙏 ** 🙏🙏
*🌻2.తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవములు🌻*
*🌻13. శ్రీ భాష్యకారులవారి ఉత్సవము🌻*
🍃🌹సర్వపురుషార్థ ప్రదాన చతురుడై వేదపర్వతమని ప్రఖ్యాతిగాంచిన తిరుమలయందు అర్చావతారమున వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వరస్వామి వారి సన్నిధానమున వేంచేసియున్న శ్రీ భాష్యకారుల వారికి మేషమాస మున ఆరుద్రా నక్షత్రము జన్మనక్షత్రమగుటచే ప్రతి సంవత్సరము ఆ ఆరుద్ర నక్షత్రమునకు ముందుగా 10 (పది) దినములుగా ప్రారంభించి శ్రీ భాష్యకారులవారికి ఉత్సవములు జరుగును.
🍃🌹మొదటిదినము శ్రీస్వామివారికి ప్రాతఃకాలారాధనము నివేదనము శాత్తుమొర పూర్తి అయిన పిదప అధి కారులు అర్చకస్వాములు పరిచా రకులు మొదలైనవారు శ్వేతచ్ఛ త్రాది మర్యాదలతో పరివారములతో మంగళవాద్యములతో శ్రీవారి శఠారిని వేంచేపుచేసుకుని విమాన ప్రద క్షణముగా శ్రీ భాష్యకారులవారి సన్నిధికి వేంచేయుదురు. అచ్చట శ్రీ భాష్యకారులవారిని ఒక తిరుచ్చి యందు వేంచేపుచేసుకుని తిరు వీథులు ఉత్సవము జరుపుదురు.
🍃🌹ప్రదక్షిణముగా మహాద్వారమువద్దకు రాగానే, ఇహల్ దోశపడి ఆరగింపుజరిగి విమాన ప్రదక్షిణముగా శ్రీ భాష్యకారులవారు తమ సన్నిధి లోనికి వేంచేయుదురు. పిమ్మట ఇహల్ గోష్ఠికి వినియోగము జరుగును. శ్రీశరారి శ్రీవారిసన్నిధి ని వేంచేయుదురు. సాయంకాలము నిత్యోత్సవమునకుగాను శ్రీ మలయప్ప స్వామివారు ఒక తిరుచ్చి యందును వారికభిముఖముగా శ్రీ భాష్యకారులవారు మరియొక తిరుచ్చి యందును వేంచేసి మహా ద్వారమువద్దకు రాగానే శ్రీమలయప్ప స్వామివారికి హారతి అయి శేష హారతి శ్రీభాష్యకారులవారికి జరుగును.
🍃🌹పిమ్మట తిరువీథులు ఉత్సవము జరిగి క్రమముగా శ్రీభాష్యకారులవారి ముఖమండపమునకు శ్రీ మలయప్పస్వామివారు వేంచేయుదురు. అచ్చట శ్రీవారికి ఆరాధ నము, నివేదనములు జరిగి హారతి అయిన పిమ్మట శేషహారతి శేష పుష్పహరము శఠారి మొదలగు మర్యాదలు శ్రీ భాష్యకారులవారికి జరుగును. తరువాత ఆరగింపు అయిన ప్రసాదము గోష్ఠికి ఆస్థాన బహుమాన పూర్వకముగా వినియోగము చేయబడును. శ్రీస్వామివారు సన్నిధికి వేంచేయుదురు.
*🙏ఓం నమో వేంకటేశాయ🙏*