*🌻2.తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవములు🌻*
*🌻14. చందన చూర్ణోత్సవము🌻*
🍃🌹ఆశ్రితజనకల్పభూరుహమై (తిరుమల) శ్రీ వేంకటభూధరము నందు వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వరస్వామివారికి నిత్యోత్సవములో చందన చూర్ణోత్సవము జరుగును.
🍃🌹శ్రీవారికి ప్రాతఃకాలారాధనము మాధ్యాహ్నికారాధనము అయిన పిదప శ్రీ మలయప్పస్వామివారు నిత్యోత్సవమునకై తిరుచ్చిలో మహాద్వారము వద్దకు వేంచేయుదురు. శ్రీ భాష్యకారులవారు వేరొక తిరుచ్చిలో మహాద్వారము వద్దకు వచ్చి శ్రీ మలయప్పస్వామివారికి అభిముఖముగా నుందురు. అప్పుడు శ్రీ మలయప్ప స్వామివారికిని శ్రీభాష్యకారుల వారికిని చందన చూర్ణము (గంధంపొడి) అర్చకులు సమర్పించెదరు.
🍃🌹వెంటనే శ్రీవారు తమ పరివారముతో చతుర్వీథులలో ఉత్సవమునకు వేంచేయుదురు. ఆ ఉత్సవ సమయములో ఉత్తర పారుపత్యదారు అనువారు భగవద్భాగవత శేషమగు ఈ చందన చూర్ణమును భక్త జనమునకు యాత్రికులకు వినియోగము చేయుదురు. శ్రీవారు ఉత్సవములో ప్రదక్షిణముగా వచ్చి శ్రీవారిసన్నిధికి వేంచేయుదురు. పిమ్మట శ్రీవారు శ్రీభాష్యకారులవారి ముఖమండపమునకు వేంచేయుదురు. అచ్చట ఆరాధనము తలియల నివేదనము జరిగి హారతి అయి స్థానబహుమాన పూర్వకముగా గోష్ఠికి వినియోగము జరుగును. తరువాత శ్రీవారు సన్నిధికి వేంచేయుదురు.
*🙏ఓం నమో వేంకటేశాయ🙏*