మా ఇంట వెలసిన మహాలక్ష్మి నీవమ్మా
నీ సేవలను మేము సేతుమమ్మా. :2:
పసుపు కుంకుమలతో నారికేళములతో
నీ పూజ ఘనముగా చేయుదము తులసమ్మా. :2:. ఆ.. ఆ
శ్రీ మాత శ్రీ తులసి రామ తులసి
జయములు మాకివ్వు కృష్ణ తులసి. :2:
గోప ప్రదక్షిణము నీకిస్తినమ్మా
గోవిందు సన్నిధి నాకీయవమ్మా. :1:
ఒంటి ప్రదక్షిణము నీకిస్తినమ్మా
వైకుంఠ సన్నిధి నాకీయవమ్మా. :2:
రెండో ప్రదక్షిణము నీకిస్తినమ్మా
నిండైన సంపదను నాకీయవమ్మా. ఆ... ఆ..
శ్రీ మాతా శ్రీ తులసి రామ తులసి
జయములు మాకివ్వు కృష్ణ తులసీ. :2:
మూడో ప్రదక్షిణము నీకిస్తినమ్మా
ముత్తైదువ తనము నాకీయవమ్మా
నాలుగో ప్రదక్షిణము నీకిస్తినమ్మా
నవధాన్య రాశులను నాకీయవమ్మా
శ్రీ మాత శ్రీ తులసి రామ తులసి
జయములు మాకివ్వు కృష్ణ తులసీ. :2:
ఐదవ ప్రదక్షిణము నీకిస్తినమ్మా
అయువైదో తనమ నాకీయవమ్మా
ఆరో ప్రదక్షిణము నీకిస్తినమ్మా
అత్త గల పుత్రున్ని నాకీయవమ్మా. ఆ.... ఆ...
శ్రీ మాత శ్రీ తులసి రామ తులసి
జయములు మాకివ్వు కృష్ణ తులసీ. :2:
ఏడో ప్రదక్షిణము నీకిస్తినమ్మా
వేణుని ఏకాంత సేవించనీవమ్మా
ఎనమిదో ప్రదక్షిణము నీకిస్తినమ్మా
యమునిచే భాదలు తప్పించవమ్మా. ఆ... ఆ....
శ్రీ మాత శ్రీ తులసి రామ తులసి
జయములు మాకివ్వు కృష్ణ తులసీ. :2:
తొమ్మిదో ప్రదక్షిణము నీకిస్తినమ్మా
తోడుగా కన్యలకు తోడీయవమ్మా
పదవ ప్రదక్షిణము నీకిస్తినమ్మా
పద్మాక్షి నీ సేవ నాకీయవమ్మా. ఆ.... ఆ....
శ్రీ మాత శ్రీ తులసి రామ తులసి
జయములు మాకివ్వు కృష్ణ తులసీ. :2:
ఎవ్వరూ పాడిన ఏ కాశి మరణం
పుణ్య స్త్రీలు పాడ పుత్ర సంతానం
రామ తులసీ లక్ష్మీ తులసీ నిత్యమూ మా ఇంట కొలువై విలసిల్లనీవమ్మా....