*🌻2.తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవములు🌻*
*🌻15. శ్రీ నృసింహజయని ఉత్సవము🌻*
🍃🌹ఆర్తత్రాణ పరాయణుడై (తిరుమల) వేంకటశైలమునందు అర్చా వతారమున వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వరస్వామివారి సన్నిధానమున చాంద్రమాన ప్రకారముగా వైశాఖశుద్ధ చతుర్దశి శుభవారమున ప్రదోషసమయమున శ్రీనృసింహస్వామివారికి జయని ఉత్సవము జరుగును.
🍃🌹ఆ దినము శ్రీస్వామివారికి సాయంకాలారాధనము తోమాల అర్చన, తోమాల దోశపడి ఆరగింపు అయిన పిదప అర్చకస్వాములు శ్రీవారి శఠారిని వేంచేపు చేసుకొని పరివారములతో మంగళ వాద్యములతో విమాన ప్రదక్షిణముగా శ్రీ నృసింహస్వామివారి సన్నిధికి వెళ్లెదరు. అచ్చట శ్రీనృసింహస్వామివారికి అభిషేకము చేసి వస్త్రాభరణ పుష్పహారాద్యలంకారములు సమర్పించి ఆరాధనముచేసి తలియలు పానకం, వడపప్పు మొదలగు పదార్థములు నివేదన చేయుదురు.
🍃🌹పిమ్మట దివ్య ప్రబంధపారాయణము శాత్తుమొర జరిగి హారతి అయి జియ్యంగారికి బహుమానము జరుగును. ఆరగింపు అయిన పదార్థములు స్థానబహుమాన పూర్వకముగా గోష్ఠికి వినియోగము జరుగును. పిమ్మట అర్చక స్వాములు శ్రీవారిని వేంచే పు చేసుకొని మంగళవాద్యములతో పరివారములతో ధ్వజ ప్రదక్షిణముగా శ్రీవారి సన్నిధికి వేంచేయుదురు. పిమ్మట తత్కాలకృత్యములు జరుగును.
*🙏ఓం నమో వేంకటేశాయ🙏*