*🌻2.తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవములు🌻*
*🌻17. శ్రీ నారాయణగిరి ఛత్రస్థాపనోత్సవము🌻*
🍃🌹విభూతిద్వయ నాయకుడై కలియుగ వైకుంఠమని వేరు కాంచిన తిరుమలయందు అర్చావతారమున వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వర స్వామివారి శ్రీ పాదముద్రలతో ప్రకాశించు శిలాఫలకముతో ప్రఖ్యాతి గాంచిన నారాయణగిరి యందు ప్రతి సంవత్సరము శయనైకాదశీ (ఆషాఢ శుద్ధేకాదశీ) పర్వదినమున అనగా ద్వాదశీ దినమునందు శ్రీపాదపూజాఛత్రస్థాపన ఉత్సవములు జరుగును.
🍃🌹శ్రీస్వామివారికి ప్రాతఃకాలారాధనము మాధ్యాహ్నికారాధనము పూర్తి అయిన తరువాత అర్చక స్వాములు, ఏకాంగులు అధి కారులు పరిచారకులు మొదలగు కైంకర్యపరులు రెండు భూచక్రగొడుగులను యమునోత్తరమునుండి పుష్ప సరములను సువర్ణ కూపతీర్థమును తీసుకొని మంగళవాద్యములతో మహా ప్రదక్షిణముగా బయలుదేరి మేద రగోటువద్దకు వచ్చి వాద్యములను నిలిపి నారాయణగిరికి వెళ్ళి దరు. అచ్చట శిలాఫలకము నందుగల శ్రీవారి పాదములకు సువర్ణ కూప తీర్థముతో అభి షేకముచేసి టెంకాయలు కొట్టి ఆరగింపు చేసేదరు.
🍃🌹పిమ్మట హారతి అయి ఆరగింపు అయిన టెంకాయలు స్థానబ హుమాన పూర్వకముగా గోష్ఠికి వినియోగము జరుగును. పిమ్మట శ్రీవారిపాదములకు ప్రాంతమునగల చెట్లకు భూచక్రగొడుగులు కట్టబడును. వెంటనే కైంకర్యపరులు భక్తులు అందరు నారాయణగిరి దిగి బంగాళా తోటకు వచ్చి అచ్చట శ్రీస్వామివారి ప్రసాదము స్థాన బహుమాన పూర్వకముగా వినియోగము చేయబడి వనభోజనము జరు గును. పిమ్మట మంగళవాద్యములతో నందరు భగవన్నామసంకీర్తనముతో మహాద్వారమునకు వచ్చెదరు. శ్రీవారి కైంకర్యములను నిర్వర్తించెదరు.
*🙏ఓం నమో వేంకటేశాయ🙏*