*శ్రీ హనుమ కధామృతము 30*

P Madhav Kumar


 *అగస్త్య మహర్షి శ్రీ రామ సందర్శనం:* 


శ్రీ రాముడు అయోధ్య లో శ్రీ రామ రాజ్యం చేస్తుండగా ఒక రోజూ అగస్త్య మహర్షి ఆయన సందర్శ నానికి విచ్చే శారు .రాముడు ”మహర్షీ !కుశలమా” ?అని ప్రశ్నించాడు .మహర్షి ”సీతా రామా !నువ్వు రాజ్యం చేస్తుండగా సాధువు లైన మాకు బాధలు యందు కుంటాయి శత కన్ధరుడు మున్నగు .దుష్ట రాక్షస సంహారం చేసి లోక ప్రియత్వం గా పాలన చేస్తున్నావు .ఇదంతా నీ కరుణా ప్రియత్వం ”అన్నాడు .శ్రీ రాముడు వినయం గా ”కుంభ సంభవా వంద తలకాయలు వున్న రాక్షసుడు శత కంధర వధ లో నా పాత్ర కంటే హనుమ పాత్ర ఎక్కువ .దీని విజయం వెనుక మారుతి మహాత్మ్యం వుంది .బలవాన్ అయిన హనుమాన్ నాకు బంటు గా వుంటే కీర్తి ప్రఖ్యాతులు నాకు ఎలా రాకుండా వుంటాయి ?హనుమంనామ జపమే కార్య సిద్ధికి కారణం .యుద్ధం లో పంచముఖాలతో తన విశ్వ రూపం చూపి రాక్షస సంహారానికి గొప్ప సాయం చేశాడు .కుమార స్వామి కూడా శ్రీ హనుమ నామ సంస్మరణ చేసి తారకాసుర సంహారం చేశాడు .”అని హనుమ గొప్ప తనాన్ని వివరించాడు .!ఈ మాటలు విన్న మహర్షి ఆశ్చర్యం గా చూసి ”రామా !హనుమ నిజస్వరూపాన్ని నాకు వివరించి చెప్పు .కార్తి కేయుడు హనుమ నామ స్మరణ తో తారకాసురుడిని ఎలా జయించాడు ?హనుమంతుని ”మూల మంత్ర ”రహశ్యం ఏమిటి ?దాని లక్షణం ,ఫలితం నాకు తెలియ జెప్పు .”అని కోరాడు .

శ్రీ రాముడు ఆనందం గా ”ముని సార్వ భౌమా !ఇది చాలా రహశ్యమైన విద్య .మీరు తప్ప ఇంకెవరికీ దీన్ని వినే అర్హత లేదు .ఈశ్వరుడు అయిదు ముఖాల వాడు .సృష్టి ,స్థితి ,సంహారము ,తిరోభావము ,అనుగ్రహము అనే అయిదు కార్యాలు చేయటానికి తన అయిదు ముఖాలతో నిర్వహిస్తూ ఉంటాడు .మన హనుమ కూడా సాక్షాత్తు శివ స్వ రూపమే .అకార ,ఉకార ,మకారాలు అనే బీజాక్షర సంయోగమే ప్రణవం అంటే ఓంకార స్వరూపం అయిన హనుమ .విరాగులలో గొప్ప విరాగి .తపస్సు స్వరూపమ్పూర్తిగా తెలిసిన వాడు హనుమ ఒక్కడే .మన్మధ వికారానికి శివుడు లోనైనాడు .కాని హనుమ లోను కాలేదు .తీవ్ర తపో నిష్ఠ లో వుంటాదేప్పుడు ..శ్రీ వర్ధనుడైన శంకర స్వరూపమే .హనుమ .నాకు ఏకాంత భక్తుడు .నేను ఈ అవతారం దాల్చాటానికి హనుమ లోకోత్తర భక్తియే కారణం .శరీరాన్ని ,అన్తహ్కరనాన్ని ,ఆత్మను ,కర్మలను నాకు సర్వ సమర్పణ చేశాడు .తన స్వాతంత్ర్యాన్ని కూడా నాకు అర్పణ చేసిన త్యాగి .”అని పొగిడాడు ,నిజ తత్వాన్ని వివ రించాడు ..

చెప్పే దానిని కొన సాగిస్తూ ”మహర్షీ !నానాత్వం అనే భావం విడిచి పెట్టాలి .అప్పుడే దుఖం దూరం అవుతుంది .విడిచి పెట్టటం అంటే ..నాది ”అనే మమకారాన్ని ,విడవటం .సంయోగాలు అన్నీ వియోగం కోసమే అనే దే జ్ఞానం .వియోగం నుంచి తప్పించు కోలేము కాని దుఖాన్నించి తప్పించు కోవచ్చు .రాగద్వేషాలను వదిలించు కోవాలి .సృష్టి అంతా ద్వంద్వం ,ద్వైతం .సృష్టి కర్త మాత్రంఅద్వైత స్వరూపుడు .కర్మ ద్వైతం .జ్ఞానం అద్వైతం .జ్ఞాన కర్మ సంయోగం కుదిరేది కాదు .అలా చేస్తే పెరుగు లో వడ్లగింజలను వేసు కోని తినటం లాగా వుంటుంది .కర్మకు ,భక్తి కి లంగరు కుదరదు .పెరుగు లో పంచదార వేసుకోన్నట్లే జ్ఞాన మార్గం చాలా శ్రేష్ఠ మైంది . . .

” మనిషి ద్వంద్వాన్ని తప్పించు కోలేడు .అందరం కర్తవ్యాన్ని చేయాల్సిందే .శత్రువు విషయం లో ప్రతీకారం ,స్నేహితుని విషయం లో సహకారం ,సమశ్యల విషయం లో పరిష్కారం ,సంసారం విషయం లో మామ కారం ,సంఘం విషయం లో పరోప కారం ,తలిదండ్రుల విషయం లోప్రతిజ్నా పాలన ,సమస్త జీవులపై భూత దయ ,మనిషి కర్తవ్యమ్ లో భాగాలే .కర్తవ్యం అంటే అదేదో చాలా గొప్ప పని అనుకోనక్కర లేదు .చలి వేస్తె దుప్పటి కప్పుకోవటం ,కాళ్ళు కాలు తుంటే చెప్పులు వేసుకోవటం ,రోగానికి అవుషధం ,ఆకలికి అన్నం అన్నీ కర్తవ్యం,ప్రతిక్రియ ,పరిష్కారం.”

‘ దివ్యర్షీ !మనిషి దిన చర్య అంతా కర్తవ్యమే .అయితే జాబాలి వంటి మా ఆస్థాన చార్వాకులు అన్నం ,దుప్పటి వంటివి అందరికీ లభించాలి కదా అంటారు .అతను నాస్తికుడు కాదు .నైష్టికుడు .మా కొలువు లో నాస్తిక వాదం చేయ టానికి మేము నిర్మించ కొన్న ఉద్యోగ ధర్మం అది .ఇక్ష్వాకుల కాలమ్ నుంచి ఇది అమలు లో వుంది .పూర్వ పక్షం లేకుడా ,సిద్ధాంతానికి బలం వుండదు .కావ్యం లో ప్రతి నాయకుని పరాక్రమం ,నాయకుని ధీరో దాత్తత ను సమర్ధించ టానికే ఉపయోగ పడుతుంది .పూర్వ పక్షం బలం వాపు లాంటిదే .సిద్ధాంతం చిన్నది అయినా అది మందు మాత్ర బలం వంటిది .అందుకే ఉపనిషత్ సిద్ధాంత వాక్యాలు చాలా చిన్నవి గా వున్నా ,చాలా సమర్ధ వంతం గా వుంటాయి ”.

”అడవిని నరికితేనే దారి ఏర్పడుతుంది ,కలుపును పీకేస్తేనే పంట బాగా పండుతుంది .ప్రజలకు ,ఆహారం వస్త్రాలు ఇల్లు విద్యా వైద్య ,,జల సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత రాజుదే .ధన వంతులు దాన ధర్మాలు చేయాలి సప్త సంతాన ప్రతిష్ట చేయాలి .రాజు వీటిని విధి గా నిర్వ హించాలి .మా వంశం తర తరాలుగా వీటినన్నిటినీ నెర వేరుస్తోంది .ఇక్ష్వాకుల పాలనలో తలిదండ్రుల బాధ్యత పిల్లలను కనటం వరకే .వారిని పెంచి ,పోషించి అవసరాలను తీర్చే బాధ్యత మా వంశం వారు అనాదిగా చేస్తున్న కృషి .”మహర్షీ !హనుమ శ్రీ హరి అవతారం గా వైష్ణ వులు పూజిస్తారు .పరమేశ్వర స్వరూపునిగా శైవులు ఆరాధిస్తారు .భవిష్యత్ బ్రహ్మ గా హిరణ్య గర్భో పాసకులు అర్చిస్తారు .జ్ఞాన ఖని అంటారు వేదాంతులు .తాను ఒక్కడే అయి వుంది కూడా ,అనేక రీతుల పూజ నేయుడు .సమర్ధుడు ,అనవద్యుడు ,ఆత్మ హితుడు ,అఖిల లోక నుతుడు ,అతని కంటే నాకు ఇష్టుడు లెడు .అతని కంటే నాకు ఇష్తమైన వస్తు వేది లెదు .అవతారమెత్తిన వానరులలోశ్రేష్టుడే హనుమ . .అతను షడ్భావ విదూరుడు .త్రిగుణా తీతుడు .పంచేంద్రియాలను ,మనస్సును ,బుద్ధిని ,అన్తకరనాన్ని ,శరీరాన్ని ,సమస్తాన్ని నాకు అర్పించి ,నా నామం లోనే రమిస్తూ ,నన్నీ తండ్రిగా ,తల్లిగా భావిస్తూ ,కొలిచే పరమ భక్తాగ్రేసరుడు హనుమ ”అని శ్రీ రాముడు అగస్త్య మహర్షికి బోధించాడు .

” హనుమ ను నిశ్చల భక్తీ తో కొలిస్తే అజేయత్వం ,అమర్త్యత్వం ,ఇష్ట కామ్యార్ధ సిద్ధి ,అమిత వాక్పటుత్వం ,సుకవిత్వం ,కామ రూపత్వం కాల జ్ఞానం ,ఆకాశ గమనం ,సర్వజ్ఞత్వం ,తత్వ జ్ఞానం ,నిగ్రహానుగ్రహం ,నిర్మలత్వం ,అవ్యయత్వం మొదలైన ప్రభావాలు ఆంజనేయ ఉపాసకులకు కలుగు తాయి .మహర్షీ !మీరు కూడా సూక్ష్మ భావాన్ని భావించి ,శ్రీ హనుమదుపాసన చేసి అభీష్ట సిద్ధిపొందండి ”అని రాముడు తెలియ జేశాడు .సాకల్యం గా ఈ విషయాలను విన్న అగస్త్య మహర్షి హనుమ పంచాముఖత్వాన్ని తెలియ జేయ వలసినది గా కోరారు .


 *సశేషం.....*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat