*🌻2.తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవములు🌻*
*🌻18. పవిత్రోత్సవము🌻*
🍃🌹పట్టుతో అఖిల హేయ ప్రత్యనీక కల్యాణ గుణాకరుడై తిరువుల (శ్రీవేంకటాద్రియందు అర్చావతారమున వేంచేసియున్న) శ్రీవేంకటేశ్వర స్వామి వారికి ప్రతిసంవత్సరము శ్రావణ శుద్ధ దశమి శుభవాసరమున అంకురార్పణము జరిగి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశీ మూడు దినములయందు పవిత్రోత్సవము జరుగును. పవిత్రోత్సవము అనగా పూసలుగా అవుర్చబడిన మాలలను ప్రతిష్ఠించి శ్రీ స్వామివారికి వారి పరివారదేవతలకు సమర్పణము చేయు ఉత్సవము. ఆగమ శాస్త్రమిట్లు చెప్పుచున్నది.
🍃🌹అర్చావతారమున వేంచేసియున్న భగవంతునకు జరుగవలసిన నిత్య పూజనములును బ్రహ్మాదు లైనను శాస్త్ర ప్రకారము జరుపుటకు శక్తులు కానేరరు. అల్పజ్ఞులగు మానవులకు భగవత్పూజన మతిదుస్సాధ్య మగుచున్నది. అందుచే సంవత్సరము భగవత్పూజనము చేయుటలో న్యూనాతిరిక్త దోషములు అనేకములు సంభవించగలవు.
🍃🌹అట్లు అజ్ఞానముచే సంభవించిన శ్రీస్వామి సంవత్సర పూజనములోని దోషములును ఈ పవిత్రోత్సవముచే తొలగి పోవును. కావున శ్రీ స్వామివారికి ప్రతి సంవత్సరము పవిత్రోత్సవము చేయతగియున్నది. మరియు పురుషార్థ కాముకులగు మానవులు శ్రీస్వామివారికి ఈ పవిత్రోత్సవము చేసినను, చేయించినను, ధర్మమును, అర్థమును, కామమును మోక్షమును సర్వవిధములగు వాంఛితములను బడయగలరు.
*🙏ఓం నమో వేంకటేశాయ🙏*