*శ్రీ హనుమ కధామృతము 32*

P Madhav Kumar


 *సత్య భామ గర్వ భంగం:* 

 

ఖగ రాజు (గరుత్మంతుడు )శ్రీ కృష్ణుని ఆజ్ఞ తో వెంటనే గంధ మాదన పర్వతం చేరాడు .హనుమ వాలం (తోక )దగ్గర నిలిచాడు .మనసు లో ఇంకా భయం పోలేదు ధైర్యం తెచ్చుకొని అత్యంత వినయం గా ”ఒ సీతా శోక వినాశకా ! శ్రీ రామ పాద సేవా దురంధరా !మహా వీరా !భవిష్యత్ బ్రహ్మా .అంజనా గర్భ సంభూతా !సీతా రాములు మిమ్మల్ని పిలుస్తున్నారు .వారిప్పుడు ద్వారక లో వున్నారు ”అని విన్న వించాడు .

తన ప్రభువుల మాట చెవిని సోకగానే హనుమ పరవశించి పోయాడు .ఆనంద బాష్పాలు కారి పోతున్నాయి .శిరసు వంచి అతి దీనంగా ”మహాత్మా !మీ వల్ల నాకు నా సీతారామచంద్రుల వారి పునర్దర్శనం లభిస్తోంది .నా తపస్సు ఫలించింది .నా సంకల్పం నెర వేరింది,మీరు శుభ వార్తను తెచ్చారని తెలియక అజ్ఞానం తో మిమ్మల్ని అవమాన పరచాను మన్నించండి ”అని పారవశ్యం తో హనుమ చేతులు జోడించి వేడుకొన్నాడు . .

హనుమ నిరంతర రామ నామాన్ని విన్న వైనతేయుడు ”హనుమా ! మూడు లోకాల చేతా సేవిమ్పబడే వాడివి .మహా మహిమాన్వితుడివి .వేదార్ధం చెప్ప గల నేర్పరివి .మీరు నన్ను ఇలా గౌరవం గా సంబోధించటం నాకు ఇబ్బంది గా వుంది .నేనే అజ్ఞానిని ,.మీ మహిమ తెలియక పొరబడి ,నా బల ప్రదర్శన చేశాను .నా గర్వాన్ని ఖర్వం చేసిన పుణ్యాత్ములు .”అని నమస్కరించాడు విష్ణు వాహనుడైన వైన తేయుడు .ఆనందం తో హనుమ అతన్ని ఆప్యాయం గా కౌగలించుకొన్నాడు.

ఇద్దరు ఒక్క సారి ఆకాశం లోకి యెగిరి ద్వారకను సమీ పించారు .ద్వారక ఇదే ఇక్కడే సీతా రాములుంటారు అని చెప్ప గానే వినయం తో ఆ పట్ట ణానికిశ్రీ కృష్ణ మందిరం చేరి ,తాము వచ్చిన విషయ౦ తెలియ జేశారు . నమస్కరించాడు .

సత్య భామను సమీ పించి కృష్ణుడు ”నేను రమ్మని కబురు చేయ గానే వచ్చాడు హనుమ .మనం ఇలా కనిపిస్తే ఒప్పుకోడు .సీతా రాముల వేశం లోనే దర్శన మివాలి .నేను శ్రీ రామ రూపం లోకి మారుతాను .నువ్వు సీతా సాధ్వి గా మారు ”అన్నాడు .ఆమె దిమ్మెర పోయింది .అది ఎలాగో అర్ధం కాలేదు .సిగ్గు తో తల దించుకుంది అహంకారం పూర్తిగా నశించింది .ఒక బొమ్మ లాగా నిలబడి పోయింది .అప్పుడు స్వామి రుక్మిణీ దేవి వైపుకు సాభిప్రాయం గా చూశాడు .

ఏ శ్రీ దేవి మిదిలలో జనకునికి నాగేటి చాలు లో లభించి పెరిగిందో ,ఏ లక్ష్మి శివ ధనుర్భంగాన్ని అలవోకగా నెర వెరచిన శ్రీ రాముని ఇల్లాలు అయిందో ,ఏ మాత అహల్యా శాప విమోచనం చేసిన శ్రీ రామ ప్రాణ ప్రియ అయిందో ,ఏ చిత్ శక్తి స్వ రూపిణి ,పరాశక్తి రావణ సంహారం కోసం సీతా మహా సాధ్వి గా అవతరించిందో ,ఆ సీతా స్వరూపమే రుక్మిణీ కాంత .కనుక వెంటనే సీతా దేవి గా మళ్ళీ రూపు దాల్చింది .శ్రీ కృష్ణ రుక్మిణి లిప్పుడు సీతా రాములై దర్శన మిస్తున్నారు .

రుక్మిణి సీతా మాత గా శ్రీ రామ రూపం లో వున్న కృష్ణుని ఎడమ అంకం మీద అధివశించి సీతా రాములు గా దర్శన మిచ్చారు .హనుమ చేతులు జోడిస్తూ ,కన్నీరు ధారా పాఠం గా ,కారుతుండ గా ,అత్యంత భక్తీ తో ,శ్రద్ధ తో వచ్చి వారిద్దరికీ సాష్టాంగ నమస్కారం చేశాడు .అనేక విధాల వారిని స్తోత్రాలతో అలరించాడు .తన జన్మ సఫలం అయిందని భావించాడు .హనుమను హరి గాధం గా కౌగలించుకొన్నాడు .”కుమారా ! మారుతీ !ఈ నారద ,తుంబురుల గానం లో వున్న తేడాను సాకల్యం గా పరీక్షించి ఎవరు అధికులో నీవు నిర్ణయించాలి .అందుకే వైన తెయుడిని నీ కోసం పంపాను ”అన్నాడు .

హనుమ చేతులు జోడించి ””గాన్ధర్వేచ భువి శ్రేష్టో బభూవ భర తాగ్రజః ”అని మహర్షి మహా కవి వాల్మీకి చేత స్తుతింప బడిన నీవు గాంధర్వ విద్యా దురంధరుడివే ,.మీరే నిర్ణయం చేయ గలరు .ఆ పని ఈ బంటు మీద పెట్టారు .రామాజ్న శిరసా వహిస్తాను ‘జగన్నాటక సూత్ర దారివి .నీవు ఆడించి నట్లు ఆడే బొమ్మలం మేము .సరే కానీండి .ప్రభు ఆజ్న నెర వేర్చాలి కదా. అలానే చేస్తాను మీ అనుగ్రహం తో ”అన్నాడు ఆంజ నేయుడు


 *సశేషం.....*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat