*అర్జున గర్వ భంగం:*
— ఒక రోజూ కృష్ణార్జునులు సముద్ర తీర విహారానికి వెళ్ళారు .కృష్ణుడు బావ మరిదితో ”అర్జునా !ఈ సముద్రాన్ని చూస్తుంటే దాని ఘోష లో ఏదో బాధ ధనిస్తున్నట్లని పిస్తుంది .”అదేమిటి బావా !ఘోష అంటున్నావు ”అన్నాడు అర్జునుడు .”ఒక కోతి (ఆంజనేయుడు )నన్ను లంఘించింది .ఒక రాజు (రాముడు )నన్ను బందిస్తానని బెదిరించాడు .ఒక ముని (అగస్త్యుడు )నన్ను ఆపోశనం పట్టాడు నా బలం ,నా అంతులేని తనం ,నా గాంభీర్యం ఈ విధం గా దూషిత మైనాయి అనే అవమాన భారం తో సముద్రం రోదిస్తున్నట్లు నాకు అని పిస్తుంది ”ఆన్నాడు కృష్ణుడు .కొంచెం అనుమానం ,మరి కొంచెం అహంకారం తో ”బావా !రాముడు గొప్ప విలు విద్యా వేత్త కదా .తన బాణాలతో కాకుండా ,రాళ్ళ తో ఎందుకు సేతువుని కట్టించాడు ?సీతా విరహం తో తన ప్రావీణ్యాన్ని మర్చి పోయాడా ?అని అనుమానం బయట పెట్టాడు
మాధవుడు నవ్వి ”రామునికి శరాలు లేకా ,కాదు ,ధీశాలి కాకా కాదు .దానికో రహశ్యం వుంది .రామ శైన్యం లో అతి బలవంతులైన అనేక మంది కపి వీరులున్నారు .వారి పాద ఘట్టనకు కట్టే వంతన ముక్కలు ,చెక్కలు అయి పోతుంది ,.హనుమ ఒక్కడు దాని మీద నిలబడి తేనే అది చీపురు పుల్లల్లా చెల్లా చెదరు అవుతుంది .హనుమ బలం లో మిగతా శైనిక బలం నూరో వంతు కూడా వుండదు ”.ఈ మాటలు అర్జునునికి మరింత అహంకారం తెప్పించాయి ”నేను బాణాలతో వంతెన కడ తాను .మీ హనుమను కూల్చమను దమ్ముంటే ”అన్నాడు .ముసి ముసి నవ్వులు నవ్వు కొన్న ముకుందుడు మనసు లో హనుమ ను తలచాడు .మరుక్షణం లో మారుతి అక్కడ ప్రత్యక్ష మై నమస్కరించి వినయం గా నిల బడ్డాడు .” మహా వీరా ,అంజనీ కుమారా !గాండీవి తన గాండీవం తో సేతువునిర్మిస్తాదట .అది నీ పాద ఘట్టనకు ఆగు తుందో లేదో చూసి చెప్పు ”అన్నాడు /రామాజ్న శిరసా వహిస్తా నన్నాడు హనుమ .
పుంఖాను పుంఖాలుగా శర సంధానం చేసి బాణపు వంతెనను సముద్రం మీద నిర్మించాడు అతి లాఘవం గా ,అత్యంత వేగంగా సవ్య సాచి అయిన అర్జునుడు .”సేతు నిర్మాణంద్రుధం గా చేశావా ” ? అని అడిగాడు కృష్ణుడు .”దిగ్గ్గజాలు వచ్చి తొక్కినా కొంచెం కూడా నష్టం కలుగదు ”అన్నాడు రెచ్చి పోయిన భీభాత్చ్చుడు .సరే నని హనుమను పరీక్షించ మని కోరాడు .ఒక్క సారి అట్టహాసం చేశాడు హనుమ ..దిగ్గజాలు వణికి పోయాయి .ఆది శేషుడు అదిరి పడ్డాడు .ఆదిత్యుని రధం లోని సప్తాశ్వాలు గతి తప్పాయి .బ్రహ్మ ఉలిక్కి పడ్డాడు .కేసరి నందనుడు కేసరిఅంటే సింహం లా గా ఒక్క సారి పైకి యెగిరి ఆ సేతువు మీదకు దూకాడు .అది నుగ్గు నుగ్గయింది పూచిక పుల్లల్లా కూలి పోయింది .సముద్రపు నురుగు అంతా వ్యాపించేసింది .పాతాళ వాసులు కంపించి పోయారు ..ఆవ మానం తో అర్జునుడు ముఖం కిందికి దించు కొన్నాడు .వీరుడు కనుక బింకం గా ”కపి శ్రేష్టా! ఇంకో సారి నిర్మిస్తాను.తప్పక నిలుస్తుంది” అని బీరాలు పోయాడు .నిలవక పొతే గాండీవం తో అగ్ని ప్రవేశం చేస్తానని ప్రతిజ్న చేశాడు ”.అలా నిలిస్తే రాబోయే యుద్ధం లో నీ జెండా పై కపి రాజు నై నీ వెంట వుంటాను ”అన్నాడు .హనుమ .
రెండవ సారి కిరీటి వారధి నిర్మించాడు .హునుమ కుప్పించి దుమికాడు దాని పైకి .అది చెక్కు చెదర లేదు .. ,కౌన్తేయునికీ ఆశ్చర్యం వేసింది .వీరుడైన విజయున్ని వాయు నందనుడు అభినందించి గాడ్హం గా కౌగలించు కొన్నాడు .యుద్ధం లో కపి ధ్వజమై విజయాన్ని చేకూరుస్తానని చెప్పి గంధ మాద నానికి చేరు కొన్నాడు కపి వీరుడైన వీర భక్త హనుమాన్ .
.ఇంతలో ఒళ్లంతా రక్తం కారుతూ శ్రీ కృష్ణుడు అక్కడికి చేరు కొన్నాడు ..అర్జునుడు దుఖం లో మునిగి పోయాడు .కళ్ళ వెంట నీరు కారు తుండ గా ”కృష్ణా !ఈ రక్తమేమిటి “”?అని గద్గద స్వరం తో అడిగాడు ..లోకాల నేలె పరమాత్మ ”అర్జునా !ఆంజనేయుడు అంటే ఎవరను కొన్నావు ?అది రుద్రా వతారం .బాల్యం లోనే ఆదిత్యున్ని పండు అని భ్రమించి ,పట్ట బోయిన పరాక్రమ శాలి .శత కంధర వధ నిమిత్తం ,నాలుగు సముద్రాలను ఆవ లీల గా దాటి న వాడు .పూర్వ ,పశ్చిమ గిరుల మీద రెండు పాదాలు వుంచి సూర్యుని వద్దవ్యా కరణం నేర్చి ”నవ వ్యాకరణ పారీనుడు ”అయాడు .వీర విక్రముడు .అసమాన బల శాలి .ధీరుడు .బ్రహ్మాండాన్ని పిండి చేయ గల సమర్ధుడు .రావణ వధకు అన్ని రకాల సహకారం అందించిన భక్తుడు .అతను నువ్వు కట్టిన శర వారధి పై దూకితే అట్ట ముక్కల్లా కూలి పోదా ?అందుకని నీ ప్రతిజ్న నెర వేర్చటం కోసం ,రా బోయే కురు క్షేత్ర సంగ్రామం లో ఆ అసహాయ శూరుని నైతిక బలం నీ కు అందించటం కోసం నేను నువ్వు కట్టిన వంతెన కింద దూరాను .నా వీపు బద్ద లైంది .శరీరం హూన మైంది .ఒళ్లంతా నుజ్జు నుజ్జు అయింది .కళ్ళు బైర్లు కమ్మాయి .గుండె చెదిరింది .మూర్చ పోయాను కూడా .అప్పటి పరి స్థితి అది .ఇప్పుడే కొంచం తేరు కొన్నాను .నేను అడ్డు పడక పొతే నీ పుల్లల వంతెన కుప్ప కూలి పోయేది .అభాసు పాలయ్యే వాడివి .హనుమ ఉద్ధృతికి ఏదీ ఆగదు .అతను తోక తోనే బ్రహ్మాస్త్రాన్ని వమ్ము చేసిన ఘనుడు .నీ మీద ప్రేమ తో ,నీ ప్రతిజ్న తీరాలనే సంకల్పం తో ఇంత చేయాల్సి వచ్చింది .”అని సవివరం గా చెప్పాడు .అర్జునుడు ఆశ్చర్యం తో ”ప్రభు ,శ్రీ కృష్ణా !హనుమ ఇంతటి పరాక్రమ బల శాలి అని తెలుసు కో లేక పోయాను .హనుమ దర్శనం చేయించి నాకు జ్ఞానోదయం కల్గించిన పురాణ పురుషుడివి నువ్వు .అతను నా ధ్వజాన్ని అది రోహిస్తే రా బోయే కురు క్షేత్ర సంగ్రామం లో మనకు దిగ్విజయం తధ్యం .”అని ఉప్పొంగి పోయాడు .
రామ రావణ యుద్ధం లోనే కాదు ,కురు పాండవ యుద్ధం లో కూడా పార్ధ ధ్వజాగ్రం పైన వుండి ఉగ్ర రూపం తో ,తేజస్సు తో ,గర్జన ల తో ,హుంకారం తో ,ఆర్భటు లతో ,శత్రు సైన్యాన్ని సగ భాగం చంపిన వాడు ఆంజ నేయుడే .అలా కాక పొతే భీష్మ ,ద్రోనులను ఎదుర్కోవటం ఎవరికి సాధ్యం ?
కృష్ణుడు బోధించిన భగవద్గీత లో పరమాత్మ ”పార్దా !కౌరవులు ఇంతకు ముందే హతు లాయరు .నీవు నిమిత్త మాత్రుడవై యుద్ధం చెయ్యి .’అని బోధించిన సంగతి మనం మరువ రాదు .దశ కన్తుడైన రావణ రాక్షసుని కిరీ టాన్ని తన్నిన హనుమకు కౌరవులు ఒక లెక్క లోని వారా ?హనుమన్నామం జపించితే చాలు కార్య సిద్ధి జరుగు తుంది .అలాంటిది హనుమ చెంతనే వుంటే విజయం నిశ్చయమే కదా..
*సశేషం.....*