*🌻2.తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవములు🌻*
*🌻22. అనంతపద్మనాభ చతుర్దశీ ఉత్సవము🌻*
🍃🌹భక్త జనకల్పమహీరుహమై ప్రణతార్తిహరుడై వేదా ద్రియని పేరు కాంచిన తిరువులయందు అర్చావతారమున వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వరస్వామివారి సన్నిధానము ప్రతి సంవత్సరము భాద్రపద శుద్ధ చతుర్దశీదినమున శ్రీవారి చక్రత్తాళ్వారు వారికి ఉత్సవము జరుగును.
🍃🌹ఈ దినమునందు శ్రీస్వామివారికి ప్రాతఃకాలారాధనము పూర్తి అయిన పిమ్మట శ్రీచక్రత్తాళ్వారు తిరుచ్చిలో అధి వసించి మహా ప్రదక్షి ణముగా తిరువీథుల ఉత్సవముతో వేంచేయుచు శ్రీవరాహస్వామివారి దేవస్థానమునకు ముందుగల మండపమునందు వేంచేయుదురు. అచ్చట వారికి అభిషేకము అయి పుష్కరిణిలో స్నానము జరుగును. పిమ్మట వారికి పుష్పాద్యలంకారము ఆరాధనము దోశెపడి నివేదనము జరిగి హారతి అగును.
🍃🌹తరువాత ఏకాంగులకు మర్యాద జరిగి క్రమముగా ఉత్సవములో శ్రీస్వామివారి సన్నిధానమునకు వేంచేయుదురు. అనంతరము అనంతపద్మనాభ వ్రతమునకు సంబంధించిన పట్టుతోరము లను శ్రీస్వామివారికి సమర్పణము చేయుదురు. అనంతరము అర్చకులు, ఏకాంగులు, ఉద్యోగస్థులు వగైరాలు ఆపట్టు తోరములను ధరించెదరు.
*ఓం నమో వేంకటేశాయ*