*🌻2.తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవములు🌻*
*🌻21. (శిక్య) ఉట్ల ఉత్సవము🌻*
🍃🌹అఖిల వేదవేదాన్తవేద్యుడై (తిరుమల) వేంకటశైలాగ్రమున వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి ప్రతిసంవత్సరము శ్రావణ బహుళాష్టమి దినమున గోకులాష్టమీ ఆస్థానమునకు మరుదినమునందు (ఉట్లు) శిర్యోత్సవము జరుగును.
🍃🌹శ్రీ స్వామివారికి ప్రాతఃకాలారాధనము, మాధ్యాహ్నికారాధనము అయిన తరువాత ఉత్సవమూర్తులగు శ్రీమలయప్పస్వామివారు ఒక తిరుచ్చి మీదను, శ్రీకృష్ణస్వామివారు మరియొక తిరుచ్చి మీదను వేంచేసి విమాన ప్రదక్షిణముగా ధ్వజస్తంభమువద్ద నుంచి యమునోత్తరములో శ్రీమలయప్పస్వామి వారును, పడిపోటువద్దనుండు చతుస్తంభమండపము నందు శ్రీకృష్ణస్వామివారును వేంచేసెదరు. పిమ్మట శ్రీవార్లకు దోశపళ్లు ఆరగింపు జరిగి హారతిఅయి ఏకాంగివారికిని యమునోత్త రం వారికిని మర్యాదలుజరిగి దోశపళ్లు స్థాన బహుమాన పూర్వకముగా గోష్ఠికి వినియోగము జరుగును. ఇట్లుగా అనాది ఆచారముగా వచ్చు చున్న పెద్దజియ్యంగారు మఠం వగైరా 16 స్థలములలో శ్రీ స్వామి వార్లు వేంచేసి ఆరగింపు హారతి బహుమానం వినియోగములు జరుగుచు తిరువీథుల ఉత్సవము జరుగును.
🍃🌹చతుర్వీథ్యుత్సవములో మధ్య మధ్యన వీథులలో యేర్పరచిన ఉట్లు కూడా భక్తజనమునకు ఆ యాత్రికజనమునకు ఆనందము కలుగునట్లు కొట్టుచు ఉత్సవమును జరిపెదరు.
*🙏ఓం నమో వేంకటేశాయ🙏*