*శ్రీ హనుమ కధామృతము 35*

P Madhav Kumar



 *భీమ గర్వ భంగం:* 

 

ఒక సారి ద్రౌపదీ దేవి ”సువర్ణ సౌగంధిక పుష్పం ”ను కోరి తెమ్మని భీమ సేనున్ని కోరింది .ఆ సమయం లో హను మంతుడు భీమునికి యక్షులను ,రాక్ష సులను జయించే శౌర్యాన్ని ఇచ్చాడు .ఆ విషయాలను తెలుసు కొందాం .పాండవులు అరణ్య వాసం చేస్తున్నారు .భీముడు ,ద్రౌపది తో కలిసి గంధ మాదన పర్వతం ప్రాంతం లో వన విహారం చేస్తున్నాడు .ఆ వనం వివిధ తరు ,లతా పుష్ప ,ఫలాలతో కన్నులకు విందు గా కని పించింది .దేవతా స్త్రీలు ఆకాశం లో విక సించిన సౌగంధిక పుష్పాలను కోస్తున్డటం ద్రౌపదీ దేవి చూసింది .అను కోకుండా ఒక పుష్పం ,వారి చేతుల లో నుంచి జారి ,ద్రౌపది దగ్గర పడింది .దాన్ని చేతి లో కి తీసు కొంది .దానిపరి మళానికి అమిత ఆశ్చర్య పడింది .దాని అందానికి ,వాసనకు అబ్బుర పడి ,చాలా సార్లు మెచ్చు కొన్నది .ఆమె మనో భావం తెలుసు కొన్న భీముడు అలాంటి పుష్పాలు ఎక్కడ వున్నా వెతికి ఆమె కు అంద జేస్తానని ,బయలు దేరాడు .

కొంత దూరం ప్రయాణించి కనక కదళీ వనం చేరాడు .చాలా మనోహరం గా వుంది వనం .జన సంచారం లేదు ఎవరైనా యెక్క డైనా వున్నారేమో నని తెలుసు కోవ టానికి శంఖాన్ని పూరించి నట్లు ,పెద్ద కేక పెట్టాడు .అప్పుడు యోగ సమాధి లో వున్న హనుమ ,ఆ ధ్వని విని అది భీమ సేనుని ది గా గుర్తించాడు .అతని బలాన్ని పరీక్షించాలనే కోరిక కల్గింది హనుమకు .తోకను పెంచి దారికి అడ్డం గా పడు కొన్నాడు .ముసలి రూపం ,ముడతలు పడ్డ శరీరం ఆజాను బాహు శరీరం,దారికి అడ్డం గా తోకను పెంచి యోగ నిద్రలో వున్నట్లు నటించాడు .భీముడు దగ్గరకు వచ్చి లేపాలి అనే వుదేశం తో భీకర శబ్దం చేశాడు .అప్పుడే మేల్కొన్న వాడి లాగా కళ్ళు నులుపు కొంటు చూశాడు హనుమ . .

భీముని తో హనుమ ”ముసలి వాడిని ,రోగంతో బాధ పడుతున్నాను .నిద్ర పోతున్న నాకు నిద్రా భంగం చేశావు .నీకు న్యాయం కాదు .నేను కోతిని .నువ్వు మానవుడివి .సాటి ప్రాణుల మీద సాను భూతి లేదా ?నా మనసు చాలా క్షోభ పడింది .ఈ ప్రదేశానికి ఎవ్వరూ రాలేరు .నువ్వు ఎలా వచ్చావు /?ఎందుకు రావలసి వచ్చింది ?ఇక్కడి నుంచి పైకి వెళ్ళే దారి కూడా లేదు .ఆకాశ మార్గం లో నే వెళ్ళాలి .ఇక్కడి ఫలాలు అమృతం లాగా మహా రుచి గా వుంటాయి ఆర గించి వెళ్లి పో .నా మాట విను .నీకు మేలు ”అన్నాడు .

భీముడు క్షత్రియోచితం గా ”నేను క్షత్రియుడిని .పాండు రాజు కుమారుడిని .వాయుదేవుని వరం చేత కుంతీ దేవికి జన్మించాను .పెద్ద లంటే నాకు గౌరవం .ఒక అవసర పని మీద వెళ్తునాను .దారి ఇచ్చి నాకు సహాయం చేయి .లేక పొతే సముద్రాన్ని లంఘించిన హనుమ లాగా నిన్ను దాటుకు పోతాను .”అని అన్నాడు .తనను ప్రశంచించి నందుకు సంతోష పడ్డ మారుతి ”నువ్వు హనుమ ప్రశంశ ఏదో చేశావు .అతని చరిత్ర తెలిస్తే నాకు చెప్పు ”అన్నాడు .

భీముడు సుందర కాండ విశే షా లన్ని పూస గుచ్చి నట్లు చెప్పాడు .”నేను కూడా వాయు వర ప్రసాదినే .హనుమ అంతటి వాడిని .నా ప్రతాపం చూపించ మంటావా ”?అని సవాలు విసిరాడు .లోపల సంతోష పడుతూ ”నేను ముసలిని. కదలలేను .కనీసం తోకను కూడా కదల్చ లేను .దాన్ని ఒక ప్రక్కకు జరిపి నీ దారి న నువ్వు వెళ్ళు .అన్నాడు .

భీముడు బల గర్వం తో ఎడమ చేత్తో తోక కదల్చ టానికి ప్రయత్నించాడు వల్ల కాలేదు .గద పక్కన పెట్టాడు .బట్టలన్నీ బిగించికట్టు కొన్నాడు .శరీరం లోని బలమంతా ఉపయోగించి ,ప్రయత్నించాడు .ఊహూ !ఏమీ ప్రయోజనం లేక పోయింది చెమట . పట్టింది .నీరస పడ్డాడు .గుండె తల్ల డిల్లింది .స్పృహ కోల్పోయాడు .కొంత సేపటికి తెలివి వచ్చి చూశాడు .అప్పుడు జ్ఞానోదయమయింది .భయ భక్తులతో పదాల మీద పడి ”స్వామీ ! !నీ మహాత్మ్యాన్ని తెలుసు కో లేక అజ్ఞానం తో ప్రవర్తించాను .నేను అతి సామాన్యుడిని .మీరు ఎవరో దయ చేసి చెప్పండి ”అని వేడు కొన్నాడు .

”నేను వాయు పుత్రుడ నైన హనుమను .లోకంలో సీతా రాముల కధ ఎంత వరకు వుంటుందో అంత వరకు నేను వుంటాను .నా నివాసం గంధ మాదన పర్వ తం లోని కదళీ (అరటి )వనం .”అని వివ రించాడు .భీమ సేనుడు వెంటనే హనుమ పాదాలపై పడి చేతులు జోడించి ,అతి వినయం తో ”అమిత ప్రతాపా !నా పూర్వ జన్మ ఫలితం గా మీ పుణ్య దర్శనం లభించింది .నేను చేసిన పాపాలన్నీ నీ దర్శనం తో తొలగి పోయాయి కృతా ర్దుడను అయాను . .ఆనాడు సముద్రాన్ని లంఘించిన మీ విరాట్ రూపాన్ని ఒక్క సారి నాకు దర్శనం చేయించి నన్ను ధన్యుణ్ణి చేయండి ”అని ప్రార్ధించాడు


 *సశేషం.....*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat