*శ్రీ హనుమ కధామృతము 40 * గంధ మాదనం లో హనుమ దిన చర్య:*

P Madhav Kumar



 *గంధ మాదనం లో హనుమ దిన చర్య:* 


కింపురుష వర్షం లో భవిష్యత్ బ్రహ్మ అయిన శ్రీ హనుమ దిన చర్య ను గూర్చి తెలుసు కొందాం .అక్కడి జనం మారుతి ముఖాన్నితప్ప ఇంక దేన్నీ చూడరు .ముందుగా హనుమ కు ప్రదక్షిణ చేసి కాని వేరే పనికి పూను కోరు .ఆయన పవిత్ర చరిత్రను తప్ప వేరు దాన్ని పథనం చేయరు . . . . .సమీర కుమారుని సేవలే తప్ప ఇతర సేవలుండవు .ప్రభంజన సుతుని ,సద్ గుణాలే కాని ,ఇతర గానం వుండదు .అందరు హనుమద్భాక్తులే .ఆయనే వారికి లోకం .ఆయన కృపా కటాక్షాలే వారి సర్వస్వం .అందరు ,ఆయన ఆశీర్వాద బలం తో ,ఆయుస్సు ,ఆరోగ్యం ,భోగం ,భాగ్యం అనుభవిస్తున్నారు .అక్కడి వారంతా ,నిత్య సంత్రుప్తులే .పుత్ర పౌత్రాభి వృద్ధి గా జీవితాలను పండించుకొంటున్న వారే .అదొక దివ్య వై భోగం .మాట ల తో చెప్ప నలవి కానిది .

హనుమ భార్య సువర్చలా దేవి కొలువు కూటం లో సీతా రాముల దివ్య చరితామృత గానం గంధర్వులు నిత్యం చేస్తూంటారు .శ్రీ రామ పవిత్ర చరిత్ర ను మునులు వివ రిస్తూంటారు .అప్సరసలు రాఘవ గాధ ను నృత్యం చేస్తుంటారు .చారణు లురాఘవుని పై పద్య గద్యాలను చదువు తారు .యక్ష ,కినర ,సిద్ధ సాద్ధ్యులు ,విద్యాధరులు ,సకల దేవతాసంఘాలు కైవారం చేస్తుంటారు . ఇంద్రాది దిక్పాలకులు ,పంచ భూతాలు ,సమస్త దేవ ,రుషి ,గణాలు ,అష్ట వసువులు ,11 లక్షల దేవతా గణం పరివేష్టించి ,హనుమను నిత్యం కొలువగా ,భవిష్యత్ బ్రహ్మ అయిన హనుమ శ్రవణ ,కీర్తన ,స్మరణ పాద సేవన , ,అర్చన ,వందన ,దాశ్య ,సఖ్య ,ఆత్మ నివేదనా పూర్వక నవ విధ భక్తీ మార్గ తత్పరుడై ,”అంతా రామ మయం -ఈ జగ మంతా రామ మయం ”అని పాడు కొంటు ,రామ భక్తి తత్పరుడై ,తన్మయుడై ,మై మరచి ఉంటున్నాడు హనుమ . ,

రుషి గణానికి హనుమ తత్వోప దేశం

ఒక రోజు న ,సనక సనంద నాది భక్తులు ,రుషి గణం ,ముని గణం హనుమ ను సమీపించి ;”;ఆంజనేయా !నువ్వు ఈశ్వ రాంశ సంభూతుడివి ,సర్వజ్నుడివి .భవిష్యత్ బ్రహ్మవు నీవే .శాస్రాలన్నీ చదివినా ,మాకు సందేహాలు తీరటం లేదు .వాటిని నువ్వే తీర్చాలి .కర్మ ,భక్తి ,జ్ఞానాలలో ఏది శ్రేష్టం ?జన్మకు కారణం ఏమిటి ?జన్మ రాహిత్యానికి ఉపాయం ఏమిటి ?మోక్షానికి మార్గం ఏమిటి ?”అని ప్రశ్నించారు .

హనుమ చాలా సంతోషించి ,మనసు లో శ్రీ రామ చంద్రుని ధ్యానించి ,మేఘ గంభీర సవనం తో ”ఆత్మ స్వరూపు లారా !మీరు అడిగిన ప్రశ్న లకుసమాధానాలు తర్కం తో ,బుద్ధి బలం తో నిర్ణయింప బడేవి కావు .వేద వాక్యాల వల్లే తెలియ దగినవి .సంసారం లో పడి మానవులు ,ఈ ప్రశ్న లను గురించి ఆలోచించరు .జిజ్ఞాసువు లకు దారి చూపే వారే లేరు .శాస్త్రం చదువుకొని ,దాని మర్మాన్ని తెలుసు కొనే వారుకోటి కి ఒక్కడు కూడా వుండరు .శాస్త్రం వేదం మీద ఆధార పడి వుంది .మహా వాక్యాలు నాలుగు .వాటి తాత్పర్యం తెలిస్తేనే జ్ఞానం కలుగుతుంది .జ్ఞాన మార్గమే శ్రేష్టం జన్మకు కారణం ,జన్మ రాహిత్యానికి ఉపాయం రెండు ఒకటే .వెలుగు ను సృస్టించ టానికి ,చీకటి పోగొట్ట టానికి ప్రయత్నం ఒకటే .అద్వైతమే అందరికి సరైన మార్గం .మోక్షం అంటే జీవ బ్రహ్మిక్యమే .ఇలా వేదం వరకు వెళ్ళ గలిగే వారు చాలా తక్కువ.గురువు చేతి లో దీపమే శిష్యునికి మార్గ దర్శనం చేస్తుంది .సర్వజ్ఞుడు అయిన ఈశ్వరుడు దక్షిణా మూర్తి అవతారం లో చిన్ముద్ర చేత జీవ బ్రహ్మిక్యాన్ని మౌనం గా బోధించాడు కదా ?

నిజ మైన జ్ఞాని పిపీలి కాది , బ్రహ్మ పర్యంతం చైతన్య స్వరూపం గా భావించి ఆ వైభవాన్ని దర్శించి ,ఆత్మానందం అనుభ విస్తుంటాడు .ఆ బ్రాహ్మీ భూత స్థితి నుంచి ,క్షణం కూడా విడిచి వుండడు .గురు శిష్య సంబంధం ”సంహితా స్వరూపం ”అణువు నుంచి , మహత్తు వరకు ,అంటే పదార్ధం లోని అణువుల నుంచి ,గ్రహాలూ ,నక్షత్రాలు ,తారా మండలం ,అనేక లోకాలతో కూడి ఉన్న అనంత విశ్వాన్ని ,నిరంతరం ,సహా చర్య తో ,విడ దీయ రానిది గా కలిపి ఉంచే శక్తి చైతన్యం ను ”సంహిత ”అంటారు .ఇది అనాది .సహజం .ప్రకృతి సిద్ధం అయిన శక్తి .అదే పరమాత్మ స్వరూపం .దానినే ”సత్”అంటారు .పురుష వాచకం గా చెబితే ”సత్య పురుషుడు ‘అంటాం .స్త్రీ వాచకం గా చెప్పా లంటే ”సతి ”అంటారు .సతి ఎప్పుడు ,సత్య పురుషుని విడిచి పెట్ట కుండా ఉండటమే ”సతీత్వ ధర్మం” ””ఇదే సంహితా లక్షణం .

శివ శక్తులు ,లక్ష్మీ నారాయణులు వాణీ బ్రాహ్మలు ,సీతా రాములు ,వీరందరూ సంహితా స్వరూపులే .ఒకర్ని ఒకరు విడిచి వుండరు .ఈ లక్షణాన్నే పురాణాలు ”అర్ధ నారీశ్వరం ‘అన్నాయి .లక్ష్మీ దేవిని ”అనపాయిని ”అనీ,సరస్వతీ దేవి బ్రహ్మ ముఖం లో ఉంటుందని అన్నాయి .సంహిత లో నాలుగు భాగాలు వున్నాయి .ఒకటి -పూర్వ రూపం .రెండవది –ఉత్తర రూపం .మూడవది -సంధి ,.నాల్గవది -సంధానం .వేదం కూడా మంత్రము ,బ్రాహ్మణము ,ఆరణ్యకము ,ఉపనిషత్తు అనే నాలుగు అవయవాలు కలిగి వుంది .కొందరు మంత్ర భాగాన్నే అంగీక రిస్తారు .అప్పుడు వేదానికి సంహితా లక్షణం వుండదు .గురు శిష్య సంహితా స్వరూపాలు ఈ విధం గా వున్నాయి .మొదటిది -ఆచార్యుడు అంటే గురువు -పూర్వ రూపం .రెండ వది -అంతే వాసి అంటే శిష్య రూపం .మూడవది –విద్య అంటే వారిద్దరిని కలిపేది నాలుగు -ప్రవచనం -విద్య చెప్పటం అదే సంధానం .విద్య అంటే వేదమే .ఈ విధం గా గురు శిష్యులు సంహితా స్వరూపులు ఆవుతారు .”అని శ్రీ హనుమ వారందరి శంశయాలను నివృత్తి చేశాడు .వారందరూ చీకటి లోంచి వెలుగు లోకి వచ్చిన భావం పొంది ,మారుతిని అనేక విధాల స్తుతించారు .


 *సశేషం.....*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat