ఓం :- ఈ ప్రణవాన్ని జపం చేస్తూ ఉంటే దివ్యజ్ఞాన ప్రకాశం కలుగుతుంది.
ఐం :- సరస్వతి మంత్రం విద్య లభిస్తుంది.
హ్రీం:- ఇది మాయా బీజం, దీనిని జపం చేయడం వలన అనెక రకాల సిద్దులు కలుగుతుంది.
క్లీం:- ఇది మన్మధ బీజం. దీనిని జపం చేయడం వలన వశీకరణ సిద్ది కలుగుతుంది.
శ్రీం:- ఇది లక్ష్మీ బీజం, దీనిని జపం చేయడం వలన ఐశ్వర్య లాభం.
గం:- ఇది గణపతి బీజం, అనేక రకాల విఘ్నాలను, విఘాతాలను తొలగించి విజయం ప్రాప్తిస్తుంది.
ద్రాం:- ఇది శ్రీ దత్తాత్రేయ బీజం,దత్త ప్రభువు యొక్క అనుగ్రహం తో సర్వం సిద్దం.
హూం:- క్రోధ బీజం ఇది, దీనిని జపం చేయడం వలన అంతర్ బహిర్ శత్రు వినాశనం కలిగి మానసిక శాంతి లభిస్తుంది.
క్రీం:- ఇది కాళీ బీజం, దీనిని జపం చేయడం వలన కాళీ దేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది.
సోం:- ఇది చంద్ర బీజం, దీనిని జపం చేయడం వలన ఆరోగ్యం.
జూం:- మృత్యుంజయ మంత్రం ఇది.
ధూం:- ఇది ధూమావతి దేవి బీజం, దీనిని జపం చేయడం వలన శత్రు యొక్క ఉఛ్ఛాటనము కలుగుతుంది. ముందుగా మన అంతరంగంలో ఉన్న సమస్త అసుర లక్షణాలు మొత్తం నాశనం అవుతాయి.
త్రీం:- ఇది తారా దేవి బీజం, దీనిని జపం చేయడం వలన తారా దేవి అనుగ్రహం చేత జ్ఞానాన్ని వాక్ సిద్ది.
.