ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్పా
20. నన్ను నడిపే ...
ప) నన్ను నడిపే దైవమా
నాలోని భక్తి భావమా
నీ చరణమ్ములే నే నమ్మితి
శరణంటూ చేసితి సన్నుతి
స్వామి శరణం అయ్యప్ప
నీ చరణం శరణం అయ్యప్ప
చ) దారి తెలియని ఎడారిలో
నీ దారి నాకు చూపినావు
దిక్కు తెలియని వేళలో
నా దిక్కు నీవై నడిపినావు
నా గతివి నీవు మతివి నీవు
నీవే నాకు శరణ్యము
చ) నిన్ను నమ్మని నాచే
నీ మాలనే వేయించినావు
పూజలేరుగని నాతో
నీ పూజలే చేయించినావు
కనుముందు నీవే కదులుతూ
మనసందు నీవే మెదిలినావు
చ) అహము విడచి ఇహము మరచి
నీ పరమ పదములే పాడితి
నిన్ను పిలుచుతూ నిన్ను తలచుతూ
నీ చరణమ్ములే నే వేడితి
నా పెన్నిధివి నీవేనంటూ
నీ సన్నిధిని నే కోరితి
**********************