శబరిగిరి దైవమా మంగళ హారతి గైకొనుమా
తిమిరావళులే వేగమె తొలగ నీ చరణ నిరతి నిరతము పాడగా ॥శబరి॥
చ1॥ ఇరు కరములను జోడించి
వినయమున శిరము కడువంచి
పదునెనిమిది జ్యోతుల వెలిగించి
శరణము కోరిన నాదు మొరవిని ॥శబరి॥
చ2॥ సమతల విలసిత మమతల
సుమముల తొలి తెలి వెలుగుల హారతి
సకల విధములా శరణు రవములా
నవవిధ భక్తుల నవ్య హారతి ॥శబరి॥
చ3|| స్వామీ శరణం అయ్యప్పా అని
హరి హర తనయా హారతి
భక్తబృంద హృదయార వింద
నవవిధ భక్తుల నవ్య హారతి ॥శబరి॥