రావా దుర్గమ్మతల్లి రవ్వల పందిళ్ళలోకి - భజన పాటల లిరిక్స్

P Madhav Kumar

 రావా దుర్గమ్మతల్లి రవ్వల పందిళ్ళలోకి, 

రవ్వల పందిళ్ళలోన ముత్యాలముగ్గులేసి 

ముత్యాల ముగ్గులోన రతనాల రాశిపోసి 

రతనాల రాశిపైన పీఠమే వేసినాము 

రావా - రావా - రావ, రావ, రావ, రావ ॥రావా దుర్గమ్మ॥


1. ఎర్రమాల వేసినాము ఎర్రబట్ట కట్టినాము 

ఉదయసంధ్య వేళలోన స్థానాలే చేసినాము 

పసుపు, కుంకుమతో పూజలెన్నో చేసినాము 

రావా రావా - రావ, రావ, రావ, రావ ॥రావా దుర్గమ్మ॥


2. మల్లెపూలు తెచ్చినాము మాలలే వేసినాము 

వేపాకులు తెచ్చినాము తోరణాలు కట్టినాము 

మేళా తాళాలతోటి భజనలే చేసినాము 

రావా - రావా - రావ, రావ, రావ, రావ ॥రావా దుర్గమ్మ॥


3. మంత్ర తంత్రాలతోటి పూజలే చేసినాము 

పులిహోర పొంగళ్లు నైవేధ్యం పెట్టినాము 

కర్పూరం వెలిగించి హారతులే ఇచ్చినాము 

రావా - రావా రావా, రావ, రావ, రావ ॥రావా దుర్గమ్మ॥

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat