మా గురుస్వామి మంచి గురుస్వామి
మాలవేసి మాకు వ్రతమునిచ్చినాడు =మా=
ఎరుమేలిలో మాతో ఆడిపాడినాడు
ఆడలేని వారిని ఆడించినాడు =మా=
అళుదా కొండను దాటలేని మమ్ము
దయచూపి మమ్ము దాటించినాడు =మా=
కరిమల మేము ఎక్కలేకుంటే
కరుణతో మాకు తోడుండినాడు =మా=
పంపలో మేము స్నానమాడివస్తే
విందిచ్చి మాకు హాయి గొలిపినాడు =మా=
నెయ్యాభిషేకం చేయించినాడు
ముక్తినొసగు స్వామిని చూపించినాడు =మా=
తప్పులెన్ని వున్నా క్షమించినాడు
అభయమిచ్చి మమ్ము ఇల్లు చేర్చినాడు =మా=