🌹🙏 ఐశ్వర్యాలు ప్రసాదించే శ్రీ హయగ్రీవ సంపద స్తోత్రం...!!

P Madhav Kumar



🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వాదినం 

నరం ముచ్చంతి పాపాని దరి,ద్ర్యమివ యోషితః...!!


హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ 

తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవత్...!!


హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో ధ్వనిః 

విశోభతే స వైకుంఠ కవాటోద్ఘాటనక్షమః...!!


శ్లోకత్రయమిదం పుణ్యం హయగ్రీవ పదాంకితం 

వాదిరాజ యతిప్రోక్తం పఠతాం సంపదాం పదం...!!🙏💐


🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿


🙏ఓం శ్రీ లక్ష్మీ హయగ్రీవాయ నమః🙏


🌹భావము :🌹


హయగ్రీవ హయగ్రీవ అనే శబ్దాన్ని పలికితే చాలు అట్టి మానవుని పాపాలన్నీ తొలగి అతని దరిద్రం తొలగుతుంది.


హయగ్రీవ హయగ్రీవ అని పలికితే చాలు నిస్సందేహంగా గంగాదేవి ప్రవాహంలా చదువు వస్తుంది. అంటే సర్వవిద్యలూ వస్తాయన్నమాట.


హయగ్రీవ హయగ్రీవ అనే ధ్వనిని వింటే చాలు వైకుంఠం యొక్క తలుపులు తెరుచుకుంటాయి. అంటే వైకుంఠలోక ప్రాప్తి కలుగుతుంది.


హయగ్రీవుని పదములతో మిళితమైన ఈ మూడు శ్లోకములు దివ్యమైనవి. ఎవరైతే వాటిని స్మరిస్తారో వారికి సంపదలు కలుగుతాయి.


జ్ఞానానికి ప్రతీకగా ప్రాదుర్భవించిన హయగ్రీవమూర్తి స్తుతి చేసినవారికి సర్వవిద్యాబుద్ధులూ లభిస్తాయి.


విద్య ఉన్నచోట అడగకుండానే అష్టలక్ష్ములూ కొలువై ఉంటారు. అంటే మానవజీవితానికి సర్వసుఖాలు అందినట్లే.


 హయగ్రీవుడు ఆవిర్భవించిన శ్రావణ పౌర్ణమినాడైనా హయగ్రీవ స్తుతిని చేసిన వారికి జ్ఞానం, సకల సంపదలు చేరువ అవుతాయి.


 పిల్లలు నిత్యం హయగ్రీవ స్తుతి చేస్తుంటే ఇక వారికి విద్యలో ఎదురుండదు. చక్కని సత్ఫలితాలు తథ్యం.


🌷మంత్రశాస్త్రం ఏం చెబుతోందంటే🌷


ఉపాసనాపరంగా మానవ, జంతు ఆకృతులు కలగలిసిన దేవతలు శీఘ్ర అనుగ్రహప్రదాతలు. అటువంటి దైవాల్లో శ్రీ హయగ్రీవ స్వామివారు ఒకరు.


శ్రీ హయగ్రీవస్వామిని భక్తి శ్రద్ధలతో ఉపాసించిన వారికి సర్వవిద్యలూ కరతలామలకమవడమే కాక, సర్వ సంపదలు లభించడం తథ్యం.


 విశుద్ధ విజ్ఞాన ఘన స్వరూపం!

 విజ్ఞాన విశ్రాణన బద్ధదీక్షమ్!

 దయానిధిం దేవభృతాం శరణ్యం!

 దేవం హయగ్రీవమహం ప్రపద్యే..!!🚩🌞🙏🌹

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat