నిరాకార నిరంజన నీకు హారతి!
అయ్యప్ప స్వామి నీకు మంగళ హారతి !!
॥నిరాకార॥
చ¹॥ పంచభూతములు అయిదు ప్రమిదలుగా చేసినాము!
మించిపోయే గుణములన్ని వంచి వత్తి చేసినాము !!
॥నిరాకార॥
తామసమను గుణము తీసి తరచి చమురు చేసినాము!
కామ క్రోధ గుణముల కై వత్తిని వెలిగించినాము !!
॥నిరాకార॥
మాయ అనే తెరను తీసి మల్లె మాల చేసినాము !
అహంకార గుణము తీసి అక్షింతలు చేసినాము!!
॥నిరాకార॥
దుర్గుణములు లక్షణములు ధూపముగా వేసినాము!
జ్ఞానమనే ధనమునే దక్షిణగా యిచ్చినాము !!
॥నిరాకార॥
శ్రీ వేంకట వరద హృదయ నీకు హారతి !
ధరణి శబరిగిరి నివాస మంగళ హారతి !!
॥నిరాకార॥