జయ జయ జయ వినాయక జయములీయవా స్వామి
అభయమీయవా.. //2//
గణ గణ గణ గణనాయక గుణమునీయవా, సద్గుణమునీయవా.
గజానన శరణం.. గజముఖ వదనా శరణం//2//
శ్రీ పార్వతి తనయా శిరసాభి వందనం..
హరహర ప్రియ సుతుడా హృదయాభి వందనం.. //2//
ప్రథమ పూజ దురంధరా ప్రణమిల్లెదమయ్యా //2//
పరమ పావనముజేయ పరుగున రావయ్యా... //గజానన//
వక్రతుండ మహాకాయ సుమశరమే నీ వరం
ఏకదంత రూపాయ సుమధురమే నీ ద్యాసం //2//
సిద్ధి బుద్ధి విఘ్మేశ్వర భజియించెదమయ్య //2//
స్వరారాగం సుధలందగ శీగ్రమే రావయ్యా. . //గజానన//
మహదేవా నీలోకం మాతాపితా సేవితం
మహాబలా నీ మార్గం అనుసరించు ఈ జగం //2//
కాణిపాక గణాధీశ స్మరియించేదమయ్యా. ... //2//
కన్నె మూల గణపతి కదలి రావయ్యా. . //గజానన//