Sri Subrahmanya Dandakam – శ్రీ సుబ్రహ్మణ్య దండకం

P Madhav Kumar
0 minute read

 జయ వజ్రిసుతాకాంత జయ శంకరనందన |

జయ మారశతాకార జయ వల్లీమనోహర ||

జయ భుజబలనిర్జితానేక విద్యాండభీకారిసంగ్రామ కృత్తరకావాప్త గీర్వాణభీడ్వాంత మార్తాండ షడ్వక్త్ర గౌరీశ ఫాలాక్షి సంజాత తేజః సముద్భూత దేవాపగా పద్మషండోథిత స్వాకృతే, సూర్యకోటిద్యుతే, భూసురాణాంగతే, శరవణభవ, కృత్యకాస్తన్యపానాప్తషడ్వక్త్రపద్మాద్రిజాతా కరాంభోజ సంలాలనాతుష్ట కాళీసముత్పన్న వీరాగ్ర్యసంసేవితానేకబాలోచిత క్రీడితాకీర్ణవారాశిభూభృద్వనీసంహతే, దేవసేనారతే దేవతానాం పతే, సురవరనుత దర్శితాత్మీయ దివ్యస్వరూపామరస్తోమసంపూజ్య కారాగృహావాప్తకజ్జాతస్తుతాశ్చర్యమాహాత్మ్య శక్త్యగ్రసంభిన్న శైలేంద్ర దైతేయ సంహార సంతోషితామార్త్య సంక్లుప్త దివ్యాభిషేకోన్నతే, తోషితశ్రీపతే, సుమశరసమదేవరాజాత్మ భూదేవసేనాకరగ్రాహ సంప్రాప్త సమ్మోదవల్లీ మనోహారి లీలావిశేషేంద్రకోదండభాస్వత్కలాపోచ్య బర్హీంద్ర వాహాధిరూఢాతిదీనం కృపాదృష్టిపాతేన మాం రక్ష
తుభ్యం నమో దేవ తుభ్యం నమః ||

ఇతి శ్రీ సుబ్రహ్మణ్య దండకమ్ ||

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat