Sri Subrahmanya Gadyam – శ్రీ సుబ్రహ్మణ్య గద్యం

 పురహరనందన, రిపుకులభంజన, దినకరకోటిరూప, పరిహృతలోకతాప, శిఖీంద్రవాహన, మహేంద్రపాలన, విధృతసకలభువనమూల, విధుతనిఖిలదనుజతూల, తాపససమారాధిత, పాపజవికారాజిత, తారుణ్యవిజితమారాకార, కారుణ్యసలిలపూరాధార, మయూరవరవాహన, మహేంద్రగిరికేతన, భక్తిపరగమ్య, శక్తికరరమ్య, పరిపాలితనాక, పురశాసనపాక, నిఖిలలోకనాయక, గిరివిదారిసాయక, మహాదేవభాగధేయ, మహాపుణ్యనామధేయ, వినతశోకవారణ, వివిధలోకకారణ, సురవైరికాల, పురవైరిబాల, భవబంధవిమోచన, దళదంబువిలోచన, కరుణామృతరససాగర, తరుణామృతకరశేఖర, వల్లీమానహారివేష, మల్లీమాలభారికేశ, పరిపాలితవిబుధలోక, పరికాలితవినతశోక, ముఖవిజితచంద్ర, నిఖిలగుణమందిర, భానుకోటిసదృశరూప, భానుకోపభయదచాప, పితృమనోహారిమందహాస, రిపుశిరోదారిచంద్రహాస, శ్రుతికలితమణికుండల, రుచివిజితరవిమండల, భుజవరవిజితసాల, భజనపరమనుజపాల, నవవీరసంసేవిత, రణధీరసంభావిత, మనోహారిశీల, మహేంద్రారికీల, కుసుమవిశదహాస, కులశిఖరినివాస, విజితకరణమునిసేవిత, విగతమరణజనిభాషిత, స్కందపురనివాస, నందనకృతవిలాస, కమలాసనవినత, చతురాగమవినుత, కలిమలవిహీనకృతసేవన, సరసిజనికాశశుభలోచన, అహార్యవరధీర, అనార్యనరదూర, విదళితరోగజాల, విరచితభోగమూల, భోగీంద్రభాసిత, యోగీంద్రభావిత, పాకశాసనపరిపూజిత, నాకవాసినికరసేవిత, విద్రుతవిద్యాధర, విద్రుమహృద్యాధర, దలితదనుజవేతండ, విబుధవరదకోదండ, పరిపాలితభూసుర, మణిభూషణభాసుర, అతిరమ్యస్వభావ, శ్రుతిగమ్యప్రభావ, లీలావిశేషతోషిత శంకర, హేలావిశేషకలితసంగర, సుమసమరదన, శశధరవదన, సుబ్రహ్మణ్య విజయీ భవ, విజయీ భవ |

ఇతి శ్రీసుబ్రహ్మణ్యగద్యమ్ ||

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!