నల్లానల్లాని బాలుడు గోపాలుడు గోవిందుడే గురువాయురు దేవుడు

P Madhav Kumar


నల్లానల్లాని బాలుడు గోపాలుడు గోవిందుడే 

గురువాయురు దేవుడు అందరికీ ఆరాద్యుడే ॥2॥


1.ఆపదలాపే వాడయా | ఆ ఆపద్భాంధవుడేనయా ॥

 గురువాయురు కోవెలలో । కొలువైయున్న వాడయా ॥

నల్లానల్లాని.      ॥2॥


2. చందన గంధపు చాయలా | మెరిసె దైవం తానయా ॥

అందరి కన్నుల పండగై | శ్రీకృష్ణుడు ఇలా వెలిసాడయా ॥

నల్లా నల్లాని        ॥2॥


3 . దేవకి నోములు పండగ | నందుని ఇంట పండుగ ॥ 

దేవతలందరి దేవుడై   ॥2॥

గురువాయురున నిలిచాడయా

నల్లా నల్లాని ॥2॥


4. రేపల్లెకు తను బాలుడై | ఆ పల్లెల గోపాలుడై ॥

యమునా విహారి దైవమై       ॥2॥

 గురువాయురున నిలిచాడయా 

 నల్లా నల్లాని        ॥2॥


5. బృందావని సంచారుడై । రాధా మానస చోరుడై ॥ 

వేణువునూదే నాదుడై      ॥2॥

గురువాయురున నిలిచాడయా

నల్లా నల్లాని        ॥2॥


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat