#అయ్యప్ప_కథ_ధారావాహిక_3

P Madhav Kumar

 #అయ్యప్ప_కథ_ధారావాహిక_3


మరొకపక్క ఉదయానన్ తన సామ్రాజ్యాన్ని నలుదిశలా విస్తరించి తను ఆక్రమించిన రాజ్యాల అన్నిటిని పాదాక్రాంతం చేసుకుని అక్కడి ప్రజలను హిసించుచుండెను పందల రాజ్యాన్ని సైతం ఆక్రమించుకున్నవలెనని సరైన సమయం కోసం ఎదురు చూడసాగేను. ఉదయానన్ అక్రమాల గురించి ఆర్య కేరళ వర్మ (అయ్యప్ప) వేగుల ద్వారా తెలుసుకుని రేపో మాపో తమ రాజ్యం పైన సైతం అతను దండయాత్ర చేయవచ్చునని అంతవరకు వేచి చూడక అతనిని సంహరించి అతని బారి నుండి తన రాజ్య ప్రజలను కాపాడాలని మరియు అతని చెరనుండి మిగిలిన రాజ్యాలకు విముక్తి కలిగించాలని నిశ్చయించుకొనేను      కానీ అప్పటికే ఉదయానన్ సైన్యము పందల రాజ్యం సైన్యం కంటే అనేక రెట్లు బలముగా మరియు అధికంగా ఉండెను

కావున ఆర్య కేరళ వర్మ పందల రాజ్య సమీప రాజ్యాలని కలిసి సైనిక సహాయమును కోరుచుందేను కానీ ఉదయానన్ లాంటి క్రూరునితో వైరమునకి మిగిలిన రాజులు భయపడ్డారు అయినా అయ్యప్ప తన ప్రయత్నంను విరమింపక సైనిక సహాయం కొరకు అన్ని రాజ్యములకు తిరగసాగేను

 శ్రీ ధర్మశాస్త మానవ జన్మలో అయ్యప్పగా అవతరించెను కనుక ఆ అవతార ధర్మాన్ని అనుసరిస్తూ తన లక్ష్యాన్ని చేరుకోన్నవలెనని తన లక్ష్యము ధర్మస్థాపన అది ప్రజల్లో మొదలవ్వాలి చెడుని అంతమొందించాలని ఆలోచన మనుషులలో మొదలవ్వాలి అందుకొరకు  స్వామి వారు శ్రమించాలి అని అనుకునెను

అప్పుడే ధర్మం యొక్క విలువ తెలుస్తుంది అధర్మాన్ని జయించడంలో ఆనందం అనుభూతిలోకి వస్తుంది అందుకొరకే అయ్యప్ప అన్ని రాజ్యాలని కలుపుకుని అధర్మం పైన పోరాటం చేయ సంకల్పించాడు అలా అయ్యప్ప స్వామి వారు సైనిక సహాయార్థం తమ సమీప రాజ్యమైన కాయకులాన్ని చేరుకునేను

ఆ సమయంలో కాయంకులానికి ఒక ఆపద వచ్చింది

వావర్ అను ఒక సముద్రపు దొంగ అరబిక్ దేశం నుండి తీరప్రాంత ప్రజలను దోచుకుంటూ కేరళను చేరేను 

వావర్ మహా శక్తివంతుడు ధైర్యశాలి తెలివైనవాడు తనకున్న కొద్దిపాటి అనుచరులతో సముద్రంలో చాలా చాకచక్యంగా దోపిడీలు చేస్తూ సముద్ర వర్తకానికి ఆటంకంగా మారెను అతనిని పట్టుకొన వలెనని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న కాయంకులం సైనికులకి అతనిని బంధించడం సాధ్యం కావడం లేదు ఆ సమయంలో కాయంకులానికి చేరిన అయ్యప్ప కాయంకుల రాజుని చేరి తాను వచ్చిన కార్యం వివరించెను కాయంకులం రాజు సైతం ఉదయానన్ పైన యుద్ధానికి మొదట సంశయించేను కానీ ఉదయానన్ వలన అన్ని రాజ్యములకు ప్రమాదమే కనుక సాయం చేయడానికి అంగీకరించాలని అనుకున్న  పిన్న వయస్కుడైన ఆర్య కేరళ వర్మ ని యుద్ధం నైపుణ్యం పై మరియు శక్తి సామర్ధ్యాల పై అనుమానం వ్యక్తం చేసెను

ముందు తన రాజ్యాన్ని సముద్ర దొంగ అయినా వవార్ బారినుండి రక్షించి చూపమని కోరెను ఆ తర్వాత తమ సహాయము పందల రాజ్యానికి అందిస్తామని తెలిపెను. 

అయ్యప్ప స్వామి వారు అందుకు సంబంధించి అతన్నీ వెతుకుతూ సముద్ర తీరాన్ని వవర్ మరియు అతని అనుచరులు సముద్రం మధ్యమున ఒక వర్తక ఓడ అపహరించి అందులో వర్తకులను తరిమికొట్టి పంపించేశారు అని తెలుసుకుని స్వామివారు ఒంటరిగా వావరు ఉన్న ఒడజాడ తెలుసుకుని అక్కడికి చేరేను

ఎవరో నూనూగు మీసాల ప్రాయమున్న ఒక పిల్లవాడు తనను వెతుక్కుంటూ రావడం వావరుకి ఆశ్చర్యం వేసింది కారణం ఏమి అని అడుగగా అందుకు అయ్యప్ప సమాధానంగా ఓవావర్ నీవు ఇలా చోరుడిల ప్రజలను ఇక్కట్లకు గురి చేయడం భావ్యం కాదు మర్యాదగా నీ తప్పులను ఒప్పుకోనీ లోంగిపో నీవు కొల్లగొట్టిన ప్రజాధనాన్ని మారాజుకి అప్పగించు నిన్ను ప్రాణాలతో విడిచి పెడతాను అని పలికెను దానికి వావర్ బిగ్గరగా నవ్వి లేనిచో అని ప్రశ్నించెను లేనిచో నిన్ను యుద్ధంలో ఓడించి నిన్ను నీ అనుచరులను బంధించి బలవంతంగా తీసుకు పోతాను అని పలికెను ఆర్యకేరళ వర్మ (అయ్యప్ప)

ఆ బాలుడి మాటలకి వావరుకి కోపం కట్టలు తెంచుకుంది కౌమార ప్రాయంలో ఉన్న బాలుడవని చూస్తున్నా లేకుంటే నీకు నీ పలుకులకి నిన్ను ఈపాటికే సంహరించి పోతానని బెదిరించేను అయ్యప్ప ప్రయత్నించి చూడు అని వావారుకి ఖడ్గము అందించి తాను ఖడ్గం ధరించేను

వావర్ కి ఆ బాలుని ధైర్యసాహసాలు చూసి ముచ్చట వేసినది ధైర్యం చూస్తే ముచ్చట వేస్తున్నది అనవసరంగా నాతో తలపడకు మీ ప్రాణాలకే ముప్పు అని పలికెను దానికి అయ్యప్ప నీ మాటలు చూస్తుంటే నీకు భయం కలిగినట్లు ఉన్నది నా మాట విని లొంగిపో నేను నీకు ప్రాణబిక్ష పెట్టేద్దాం అని 

వవారును కవ్వించెను రేపటి రోజున అయ్యప్ప స్వామివవార్ యుద్ధ సన్నివేశాలు ముఖ్యాంశాలు తెలుసుకుందాం 🙏🏻🌹

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat