#అయ్యప్ప_కథ_ధారావాహిక_4

P Madhav Kumar

 #అయ్యప్ప_కథ_ధారావాహిక_4


వావరు అనుచరులు ఆ బాలుని పైకి కత్తి 

దూయబొగా వావరు వద్దని వారించి తానే ఖడ్గము ధరించి అయ్యప్ప తో యుద్ధానికి సిద్ధమయ్యాను

వావరు యుద్ధ విద్యల్లో ఆరితేరిన వాడు కావున అయ్యప్పని సునాయాసంగా ఓడించగలనని అనుకోనేను కానీ ఇద్దరి కత్తులు నిప్పులు చేరుగుతున్నాయి ఇరువూరిలో ఒక్కరు కూడా అలసిపోవడం లేదు అలా మూడు దినములు ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది వావరు శక్తి క్షీణించింది అతని ఖడ్గ విద్యలో ఓడించే మొనగాడే పుట్టలేదని అనుకున్న వావరు మొదటిసారి ఓటమిని అంగీకరించాడు అయ్యప్ప ఖడ్గ ధాటికి వావర్ చేతిలోని కత్తి ఎగిరి కింద పడింది

వావరు తన ఎదురుగా నిలిచి ఉన్న బాలుని చూసి సంభ్రమాశ్చర్యాలకు గురి అయ్యాను అతని శక్తి సామర్ధ్యాలకు ప్రతిభా పటవాలను కొనియాడెను

అయ్యప్పను కౌగిలించుకుని తన ఓటమిని ఒప్పు కొనెను అయ్యప్ప సైతం వావరుని ఆలింగనం చేసుకుని లొంగి పొమ్మని హితువుపలికెను

అంతలో సముద్ర మధ్యములో తుఫాను చెలరేగింది ఆ తుఫాను ధాటికి ఓడ అల్లకల్లోలం అవుతున్నది

వావరు అనుచరులు అందరూ తుఫాను ధాటికి భయబ్రాంతులకు గురి అవుతున్నారు

ఓడ పెనుగాలికి ఒకపక్క వంగిపోయి ఓడలోకి నీరు ప్రవేశించు చున్నది అందరూ తమ ప్రాణాలపైన ఆశ వదిలేసుకున్నారు

ఆ సమయంలో అయ్యప్ప నేనున్నాను భయము వలదని అభయమిచ్చెను తాను నీటిలో దిగి ఓడను  ఒంటిచేత్తో లాగుతూ తీరానికి చేర్చేను

ఆ అద్భుత దృశ్యం చూసిన వావరు ఆ బాలుడు సామాన్య మానవుడు కాదని సాక్షాత్ దైవ స్వరూపం అని గ్రహించి అయ్యప్ప పాదాలపైన పడి తన తప్పులను మన్నించమని వేడుకునేను

అయ్యప్ప వావరుని పైకి లేపి తన గుండెలకు హత్తుకునెను అప్పటినుండి వావరు అయ్యప్ప భక్తునిగా మారిపోయేను అయ్యప్ప అనుచరుల్లో ఒక్కడిగా ప్రసిద్ధికెక్కిను

అయ్యప్ప వావరుని ఒక మంచి స్నేహితుడు గా తలచి తన సైన్యంలో ముఖ్యమైన స్థానాన్ని ఇచ్చెను

వావర్ని ఓడించడమే కాకుండా అతని మనస్సు మార్చి తన భక్తుడు గా చేసుకున్న అయ్యప్ప శక్తి సామర్థ్యాలపై కాయంకులం రాజుకి పూర్తి నమ్మకం ఏర్పడింది

ఉదయానన్ ని అంతం చేయగల వీరుడు అయ్యప్ప మాత్రమేనని నమ్మి తన సైన్యాన్ని అతని వెంట పంపెను

అయ్యప్ప ధైర్య పరాక్రమాలను చుట్టుపక్కల రాజ్యములో వారందరికీ తెలిసినది వారందరూ అయ్యప్పకు సాయం చేసేందుకు ముందుకు వచ్చినారు అలా అయ్యప్ప ఒక మహా సైన్యాన్ని ఉదయాననికి వ్యతిరేకంగా నిర్మించెను


తనకు వ్యతిరేకంగా పందల రాజ్యం సైన్యాన్ని సమాయత్తం చేయుచున్న విషయం వేగుల ద్వారా ఉదయాననికి చేరెను

తమ పై యుద్ధానికి సిద్ధం అవుతున్న రాజ్యాన్ని దెబ్బతీసి తన పరాక్రమం వారికి తెలియజేయవలెను ఉదయానన్ నిశ్చయించుకున్నాడు తన సైన్యాన్ని పందల రాజ్యపు గ్రామాలపై మెరుపుదాడి చేయమని పురమాయించేను అందులోని ఒక బృందం నేడు చెంగనూరు గా పిలువబడుతున్న గ్రామంపై దాడికి పాల్పడినది

కానీ అంబలపుళ యోగానికి చెందిన కుచు కాడుత్త వలియ కడుత్త అను ఇరువురు కళరి యోధులు ఆ దాడులను తిప్పి కొట్టారు

కుచు కాడుత్త  కత్తి విద్యలో ప్రావీణ్యుడు వళియ కాడుత్త విలువిద్యలో ప్రావీణ్యుడు వీరిరువురు కలిసి ఉదయానన్ బృందాన్ని ధైర్యసాహసాలతో తిప్పికొట్టారు

మిగతా ప్రాంతాలలో ఉదయానన్ సేనలు మెరుపు దాడులతో అరాచకం సృష్టించాయి కుచు కాడుత్త మరియు వాలియ కాడుత్త గురించి తెలిసిన అయ్యప్ప వారిని పిలిపించి వారి ధైర్య పరాక్రమాలకి మెచ్చుకుని వారిని తన సైన్యంలో ముఖ్య నాయకులు నియమించెను


చీరప్పంచిర వంశానికి చెందిన ముఖ్య నాయకుడు అయిన మూపన్ కూడా అయ్యప్ప సేనకు తన సహాయం అందించడానికి ముందుకు  వచ్చేను అతను  సైన్యానికి కళారి విద్యను నేర్పుతూ సురక్షితులను చేయసాగెను


చీరప్పంచిర ముక్కాల వట్టం అంబలపుళ అలనాడు యోగం వీటి గురించి పూర్తి వివరాలు మరి ఒకసారి తెలుసుకుందాం మిగతా చరిత్ర అ రేపటినుండి తెలుసుకుందాం

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat