#అయ్యప్ప_కథ_ధారావాహిక_5

P Madhav Kumar

 #అయ్యప్ప_కథ_ధారావాహిక_5


అయ్యప్ప తన సైన్యాన్ని మూడు విభాగాలుగా విభజించి ఒక దళానికి వావర్ని ఒక దళానికి 

కూచు కడుత్తను నియమించి మరొక దళానికి తానే స్వయంగా నాయకత్వం వహించెను

ఉదయానన్ సామ్రాజ్యాన్ని ముట్టడి చేయడానికి మూడు దిక్కుల నుండి దాడి చేయుటకు మూడు దళాలు వేరువేరుగా ముందుకు సాగాయి

కానీ ఉదయానన్ వీరి దాడిని ముందే గ్రహించి అరణ్యంలో తమకు వెన్నతో పెట్టిన విద్య అయినా మెరుపు దాడులు తన సేనలతో చేయించ సాగారు అయ్యప్ప నేతృత్వంలో అతని సైన్యం వారిని ప్రతిఘటిస్తూ ఎదురు వచ్చిన ఉదయనాన్ సేనలని అంతమొందిస్తు ముందుకు కదిలెను

ఉదయానన్ అంతకుముందు సాధించిన విజయాలకు చిహ్నాలుగా పలుచోట్ల శత్రుదుర్భేద్యమైన కోటలని నిర్మించి అందులో తన సంపదను భద్రపరచుకునేను

వాటిలో ముఖ్యమైనవి ఇంచిప్పార తలప్పార మరియు కరిమల ప్రదేశములలో ఉన్నవి వావర్ తన సేనతో ఇంచిప్పార కోట మీద దాడికి బయలుదేరెను

కానీఇంచిప్పార శత్రుదుర్భేద్యమైన కోట అలుద నది తీరాన నిర్మితమై ఉన్నది ఆ కోట చుట్టూ శత్రువులని ఉచ్చులో పడేయడానికి అనేక కందకములు ఉన్నవి

వాటి గురించి అంచనా వేయని వావర్ సైన్యం ఆ ఉచ్చులో పడి పైకి రావడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఉదయానన్ సేన లో ముఖ్య నాయకుడు మరియు అతి క్రూరాతి క్రూరమైన నాయకుడు పుదుస్సేరి ముందన్ ఆ కోట పై నుండి వావర్ సైన్యము పైన దాడి చేసినాడు ఆ దాడిలో కొందరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు చాలామంది గాయాలపాలైనారు వావర్ మరియు అతని సైన్యం ఆ దాడి నుండి ప్రాణాలు రక్షించుకొనుటకి వెనుదిరగక తప్పలేదు

అదే సమయంలో అరణ్య మార్గంలో కూచు కడుత్త సేనాపై ఉదయానన్ తానే స్వయంగా రంగంలోకి దిగి తన సేనలతో ముప్పేట దాడి చేసినాడు

కూచు కడుత్త ఉదయానన్ ఎదురుపడి ఉదయానన్ పైకి కత్తి దూసి అతనితో యుద్ధం చేయసాగినాడు

ఉదయానన్ అతనిని ప్రతిఘటిస్తూ అతని పైన దాడి చేసినాడు ఆ యుద్ధంలో ఉదయానన్ కూచు కడుత్తను ఓడించి అతని రెండు కాళ్ళు నరికి నా పరాక్రమం గూర్చి మీ నాయకునికి తెలియజేయుటకు నిన్ను ప్రాణాలతో వదిలి పెడుతున్నాను అని పలికి తన సైన్యాన్ని తీసుకొని వెనుదిరిగిపోయినాడు

కూచు కడుత్త అవమానభారంతో ఆత్మహత్యకు ప్రయత్నిస్తుంటే అప్పుడు వలియా కడుత్త అతనిని వద్దని వారించి నచ్చజెప్పి తమ సైన్యముతో అయ్యప్ప వద్ద కు బయల్దేరినాడు

అయ్యప్ప సేనకు మరియొక ఎదురుదెబ్బ తగిలింది

చీరప్పంచిరా నాయకుడైన ముపన్ అయ్యప్ప సేనకు సాయం చేయడం తెలిసి ఉదయానన్ అతని పైన కోపం తో అతని గ్రామానికి వెళ్లి మారణకాండ సృష్టించాడు ముపన్ కుమార్తెను అపహరించి అత్యంత కిరాతకంగా ఆమెను వధించెను

(ముపన్ కుమార్తె చరిత్ర మరియొక సారి తెలుసుకుందాం ఇప్పుడు మనము నిత్యం పూజించే మాలికాపురత్తమ్మ మంజుమాత ముపన్ కుమార్తె అలాగే అయ్యప్ప స్వామి వారికి  ఇష్టమైన ఆరవన్న పాయసం మొట్టమొదటిసారి తయారుచేసి స్వామివారికి నివేదించింది ఆ మహాతల్లి)

అయ్యప్ప దళంలో ఉన్న ముపన్ కి ఈ వార్త తెలిసి కుప్పకూలిపోయాడు అయ్యప్ప ముపన్ని ఓదార్చి తన సేనను తీసుకొని మూపన్ గ్రామానికి వెనుదిరిగి బయలుదేరేను

ఇలా వరుసగా దిబ్బ పైన దెబ్బతిన్న అయ్యప్ప సైన్యంలో ఉదయానన్తో గెలుస్తామన్న నమ్మకం సన్నగిల్లింది

అందరిలో నిరాశానిస్పృహలు ఆవహించినవి అయ్యప్ప స్వామి వారు మూడు దళాలను ఎరుమేలి లో కలవమని ఆదేశించినాడు

వెనుదిరిగిన వావర్ సేన కూచు కడుత్త సేన అయ్యప్ప సేనాని ఎరుమేలిలో కలిసాయి సైనికులలో సేనా నాయకులలో ఆవహించిన నిరాశ గమనించిన అయ్యప్ప  తమ సేనాని ఉద్దేశించి ఓ వీరులారా ఇది యుద్ధం యుద్ధంలో గెలుపోటములు సహజం నీతిని న్యాయాన్ని ధర్మాన్ని నిలబెట్టేందుకు మనం పోరాడుతున్నాం

ఈ క్రమంలో మనకు కొన్ని అగ్నిపరీక్షలు ఎదురయ్యాయి కొన్ని ఎదురుదెబ్బలు తగిలాయి అంతమాత్రాన మనం ఓడిపోయినట్లు భావించవద్దు

ధర్మం ఎప్పుడూ ఓడిపోదు గెలవాలంటే ముందు మన పైన మనకు నమ్మకం కావాలి అంతర్గతంగా దాగి ఉన్న శక్తులను బయటికి తీయాలి

మీ పైన మీ శరీరం పైన మీకు నిగ్రహం ఉండాలి అవి లేనప్పుడు మనం ఎంత ప్రయత్నించినా మనల్ని విజయం వరించలేదు అని బోధించేను

మీకు నా పైన నమ్మకం ఉన్నదా అని ప్రశ్నించెను దానికి సైనికులందరూ ముక్తకంఠంతో ఉంది అని సమాధానం ఇచ్చినారు

అటులైన నేను చెప్పిన విధంగా చేయండి విజయం తప్పక మనల్ని వరిస్తుంది అని భరోసా ఇచ్చినాడు ఆ అయ్యప్ప స్వామి వారు అటు పిమ్మట అయ్యప్ప స్వామి వారు తన సైనికులను మండల కాలం వరకు దీక్ష చేయవలసిందిగా ఆదేశించడం జరిగినది అప్పటినుండి శ్రీ ధర్మశాస్త్ర వారి మండల దీక్షలు ప్రారంభమయ్యాయి..

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat