#అయ్యప్ప_చరిత్ర_ధారావాహిక_6
అటు పిమ్మట ఆర్య కేరళ వర్మ (అయ్యప్ప)తన సైనికులకి మండల కాలం వరకు దీక్ష చేయవలసిందిగా ఆదేశించారు
స్వామి వారు భక్తజనవత్సలుడు. ఆయన అనుగ్రహం ఉంటే మనం సాధించలేనిదంటూ ఏమీ లేదు. అని ఎరుమేలిలో శ్రీ ధర్మశాస్త్రను ధ్యానిస్తూ కఠోర నియమాలతో దీక్ష చేయవలసి ఉన్నది ఈ దీక్ష చేసిన వారికి శని తొలగిపోవునని మనలో ఉన్న అనంత శక్తులు వెలికి తీయవచ్చునని చెప్పి శని దేవుడు ధర్మశాస్త్రకు వివరించిన దీక్షను అయ్యప్ప తన సైనికులతో చేయించ తల పెట్టి ఆ మండలం పాటు సైనికులంతా శ్రీ ధర్మశాస్త్రాన్ని కొలుస్తూ నల్లని వస్త్రాలు మాత్రమే ధరిస్తూ ఒక్కపూట స్వాతిక ఆహారం భుజిస్తూ మిగిలిన సమయమంతా ఆ శాస్త్ర ధ్యానములొ గడప సాగినారు సైనికులంతా
మండల కాలమంతయు ఎరుమేలిలో నివాసం ఏర్పరుచుకుని కఠిన నియమాలను పాటిస్తూ శాస్త వారిని ధ్యానిస్తూ మండల కాలం పూర్తి అయ్యేసరికి సైనికుల అందరిలో నూతనోత్తేజం ఆవహించినది తమలొ ఏవో కొత్త శక్తులు వచ్చినట్లు అనుభూతి చెందారు తిరిగి వారికి ఉదయానన్ గెలుస్తామన్న నమ్మకం బలంగా ఏర్పడినది అందరూ (ఆర్య వర్మకి) అయ్యప్పకి నమస్కరించి తమతో ఈ పవిత్రమైన శాస్తా దీక్ష చేయించినందుకు స్వామి వారికి సైనికులంతా కృతజ్ఞతలు తెలిపినారు
అలా మొట్టమొదటిసారి స్వామివారి దీక్షలు అయ్యప్ప సేనాతో ప్రారంభమయ్యాయి అవి నేటికీ కొనసాగుతున్నాయి
మకర సంక్రమణానికి సరిగ్గా పది రోజుల ముందు అందరూ ఎరుమేలిలో సమయత్తమై
అస్త్ర శాస్త్రాలని సిద్ధం చేసుకుని అధర్మశాస్త్రకి పూజించి ఇక ఉదయానన్ అంతం ఖాయమని నమ్మి ఒక అలౌకిక ఆనందం లో రంగులు చల్లుకుంటూ నృత్యాలు చేయ సాగారు అలా సైనికులందరూ ఎరుమేలి శ్రీ ధర్మశాస్త్ర సన్నిధిలో ఆనందంతో చేసిన నృత్యమే నేడు పెట్టతుళ్ళల్ గా ప్రసిద్ధికెక్కింది
(ముఖ్యంగా సైనికులకు నాయకత్వం వహిస్తున్న సేనాధిపతుల వంశపారంపర్యం తో నేటికి ఎరిమేలి లో జనవరి 12 తారీఖు నాడు ఉదయం 11 గంటలకు అంబాళ్ళపుళ్ళ యోగం వారి ఆధ్వర్యంలో ఆకాశంలో గరుడ పక్షి ఈ అంబాళ్ళపుళ్ళ యోగం వారిని అనుసరిస్తున్న సందర్భంలో శ్రీ ధర్మశాస్త్ర వారి పెట్టతుళ్ళల్ కార్యక్రమము ఎరుమేలి పేటశాస్త్ర సన్నిధానం నుండి ప్రారంభమై వావరు స్వామి మసీదుకు వచ్చి వావర్ వంశీయులు ఇచ్చిన గంధము ఇరువురు రుద్దుకొని వావర్ వంశీయులతో కలిసి ఊరేగింపు జరుపుతారు ఎరుమేలి లోని శ్రీ ధర్మశాస్త్ర దేవాలయానికి మేళతాళాలతో ఏనుగు పైన శాస్త్ర వారిని ఉరేగిస్తూ ఎరుమేలి శ్రీ ధర్మశాస్త్ర దేవాలయానికి ఈ బృందం వెళ్లగానే శ్రీ ధర్మశాస్త్ర దేవాలయ ప్రధానతంత్రి ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధికారులు వీరికి సగౌరవంగా ఆహ్వానం పలికి శాస్త్ర వారి దేవాలయం లోకి తీసుకుని వెళతారు ఈ ఊరేగింపులో వావర్ స్వామి వంశీయులు పాల్గొని వారు కూడా ఎరుమేలిల్ శ్రీ ధర్మ శాస్త వార్ని అధికారికంగా దర్శనం చేసుకుంటారు అలాగే అదే రోజు అనగా జనవరి 12 తారీకు నాడు మధ్యాహ్నం రెండు గంటలకు అలాంగడ్ యోగంవారు ( Alangad Yogam ) పగటి పూట ఆకాశంలో నక్షత్రాన్ని చూసి పేట శాస్త్ర దేవాలయం నుండి ఊరేగింపు ప్రారంభమై ఎరుమెలిలొ శ్రీ ధర్మ శాస్త దేవాలయానికి బయలుదేరుతారు వీరు మాత్రము వావర్ స్వామి మసీదులో కి వెళ్ళరు ఎందుకనగా సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే వావరుస్వామి వంశీయులకు ఎరుమేలిల్ శ్రీ ధర్మ శాస్త వారి దర్శనం ఉంటుంది గనుక అలాగే ఎరుమేలి లో పగటిపూట నక్షత్రం వచ్చే సందర్భం ఈ సంవత్సరంలో ఈ ఒక్క రోజే ఉంటుంది ఆ నక్షత్రంలో స్వామివారు రూపాన్ని చూసుకుంటారు ప్రపంచం లో ఎక్కడా కూడా పగటి పూట ప్రతి సంవత్సరం ఒకే సమయానికి ఒకే చోట నక్షత్రం కనిపించు అనునది ఆ అయ్యప్ప స్వామి వారి లీలగా ఈనాటికీ భక్తులందరూ కొలుస్తారు అలంగాడు యోగంకు సంబంధించిన కాంబ్లీ పనికార్ వంశానికి చెందిన కాంబ్లీ శంకరన్ వేణుగోపాలన్ KambillySankaran Venugopal నాయకత్వంలో భక్తులంతా గజ వాహనాలతో ఊరేగింపుగా బయలుదేరి ధర్మ శాస్త్ర వారిని దర్శనానికి వస్తున్న సమయంలో ఎరుమేలిల్ శ్రీ ధర్మ శాస్త దేవాలయ ప్రధాన తంత్రి వర్యులు శబరిమల దేవస్థానం బోర్డు ముఖ్య అధికారులు స్వాగతం పలికి ఎరుమేలిల్ శ్రీ ధర్మ శాస్త వారిని దర్శనం చేసుకుంటారు అప్పటితో ఎరుమేలి పేటతుళ్ళల్ ముగిసినట్టుగా అధికారికంగా ప్రకటిస్తారు
రెట్టించిన ఉత్సాహంతో అయ్యప్ప సేనలు తిరిగి యుద్దానికి బయలుదేరినారు దట్టమైన అరణ్యం లోకి ప్రవేశించిన సేనలు కాలంకట్టి వద్ద ఆగి దాడులకు సంబంధించిన ప్రణాళికలు రచించినారు
తమ మొదటి లక్ష్యం ఇచ్చిప్పర కోటను ఆక్రమించుకోవడం కోసం ఈసారి వారు మరొక మార్గాన్ని హెంచుకున్నారు అలుదా నది దాటి కోటను చేరినారు.
రేపటి రోజున స్వామివారి చరిత్ర మరింత తెలుసుకుందాం