#అయ్యప్ప_చరిత్ర_ధారావాహిక_7

P Madhav Kumar

 #అయ్యప్ప_చరిత్ర_ధారావాహిక_7


ఆర్య కేరళ వర్మ (అయ్యప్ప) తన సైనికులు అందరిని పెద్దపెద్ద బండరాళ్లను తిసుకురమ్మని ఆజ్ఞాపించి కోట చుట్టూ ఉన్న కందకాలను సైనికులు తెచ్చిన రాళ్లతో పూడ్చి వాటిపై నుండి కోటను చేరేను

ఒకసారి దెబ్బతిని వెళ్ళినవారు మళ్లీ మెరుపుదాడి చేస్తారని ఊహించని పుదుశ్శేరి ముండన్ ఆ మెరుపు దాడి ఊహించలేదు

వవార్ అతనితో పోరాటం చేసి అతని తల నరికి హతమార్చినడు అయ్యప్ప సేన ఇంచిప్పర కోటను కైవసం చేసికొనేను

అదే సమయానికి వలియకడుత్త నేతృత్వంలోని సేనా ఉదయానన్ సైనికులతో యుద్ధం చేసి తలప్పార కోటను కైవసం చేసుకుంది

ఒకే సమయంలో తన ముఖ్యమైన స్థావరాల పైన మెరుపు దాడి చేయడంతో ఉదయానన్ దిగ్భ్రాంతి చెంది తీవ్రమైన ఆగ్రహావేశాలతో రగిలి పోయినాడు

తన మహా సైన్యాన్ని సమాయత్తం చేసి కరిమల కోటలొనుండి తన సైన్యాన్ని అయ్యప్ప సేనలపైకి యుద్ధానికి పంపినాడు

అయ్యప్ప స్వామి వారు తన త్రివిడ దళాలని మూడు దిక్కుల నుండి ముప్పేట దాడి చేయమని ఆదేశించారు

ఒకేసారి మూడు దిక్కుల నుండి దాడి చేయడంతో ఉదయానన్ సేనా అయోమయానికి గురి అయ్యింది

ఒకవైపు పులియకడుత్త శరముల వర్షం కురిపించసాగాడు మరియొక వైపు వావర్ ప్రళయ రుద్రుడుగా దొరికిన వారిని దొరికినట్టు తన ఖడ్గంతో సంహరించుచున్నాడు

అయ్యప్ప స్వామి వారు గజారోహనుడై కరిమల కోటను చేరి కోట తలుపులు బద్దలు కొట్టి కోట లోపలికి ప్రవేశించినడు

ఉదయనాన్ కోటపై నుంచి అయ్యప్ప స్వామి వారిని చూసేను ఏనుగు పైన కూర్చున్న స్వామివారి దివ్య తేజస్సు చూసి అతను మామూలు యుద్ధవీరుడు కాదని అతనిని ఇదివరకు ఎక్కడ చూసిన జ్ఞాపకం మదిలో కలిగినది

అప్పుడు ఉదయానన్ కి పూర్వం తాను శబరిమలలో పూజారిని సంహరించి శ్రీ ధర్మశాస్త్ర దేవాలయను కొల్లగొట్టిన విషయము గుర్తుకు వచ్చినది

అప్పుడు ఉదయానన్ తాను ఆలయంలో ధ్వంసం చేసిన శ్రీ ధర్మశాస్త్ర ఇప్పుడు అయ్యప్ప రూపంలో అవతారం దాల్చి వచ్చిందని అర్థం అయ్యింది

తన అంతం సమీపించింది అని అర్థమైన ఉదయానన్ విజయమో వీర మరణమో ఈ అవతార పురుషుడైన అయ్యప్ప స్వామి వారి చేతిలోనే పొందవలెనని తన ఖడ్గం తీసుకొని రణరంగంలోకి ప్రవేశించినాడు

అప్పటివరకు విల్లంబులు ధరించి శత్రు సంహారం చేయుచున్న అయ్యప్ప స్వామి వారు ఉదయానన్ సమీపించిన పిదప ఖడ్గము చేత బట్టి తన వాహనమైన గజము పైనుండి కిందకు దిగి ఉదయానన్ ఎదురు నిలిచినాడు

ఉదయానన్ అయ్యప్ప పైన తన ఖడ్గంతో యుద్ధము చేయుచుండెను కానీ ఎంత ప్రయత్నించినా స్వామివారి వేగాన్ని అతను అధిగమించలేక పోతున్నాడు

అయ్యప్ప ఖడ్గము వాయు వేగముతో మెరుపులా తిప్పుతున్నాడు ఉదయానన్కి నీరసం ఆవహించసాగినది తనని స్వామి అయ్యప్ప వారు తలుచుకుంటే ఈ పాటికే మట్టుపెట్టి ఉండగలరని కానీ ఎందుకొరకో ఎదురుచూస్తూ కాలయాపన చేస్తున్నారని అర్థమైంది ఉదయానన్కి 

ఉదయనాన్ ఒంటి నిండా తీవ్రగాయాలయ్యాయి అయ్యప్ప ఖడ్గ శక్తికి తనచేతిలోని ఖడ్గం రెండుగా చీలి పోయినది అయ్యప్ప ఉదయానన్ చేతిలోనీ ఖడ్గాన్ని దూరంగా విసిరి వేసి ఉదయానన్ ని కిందకు పడవేసెను ఉదయానన్ కదలలేని స్థితిలో నేలపై పడి ఉన్నాడు 

అప్పుడు అయ్యప్ప స్వామి వారు ఉదయానన్ ఈడ్చుకుంటూ తీసుకెళ్లి కుచ్చుకడుత్త ముందు మోకరిల్లెల చేసినాడు తన కాళ్లు నరికిన ఉదయానన్నీ తన కాళ్ల పైన పడి  మోకరిల్లెల చేసిన అయ్యప్పను చూసి భక్తితో నమస్కరించెను  కుచ్చుకడుత్త

అయ్యప్ప స్వామి వారు కుచ్చుకడుత్త చేతికి ఖడ్గాన్ని అందించి ఉదయానన్ వధించమని ఆజ్ఞాపించాడు

కుచ్చుకడుత్త ఒక్కసారిగా గట్టిగా అయ్యప్పని స్మరిస్తూ తన ముందు మోకరిల్లి ఉన్న ఉదయానన్ తల తెగ నరికినాడు


(అప్పుడు కాంబ్లీ పనికరన్ శరణం అయ్యప్ప అంటూ మొట్టమొదటిసారి విజయగర్వంతో స్వామిని శరణువేడారు అప్పటినుండి స్వామియే శరణమయ్యప్ప అంటూ శరణు ఘోష ఉదయానన్ సంహారం తర్వాత మొట్టమొదటి శరణుఘోష 

కాంబ్లీ పనికరన్ ఆ దేవాది దేవుడైన అయ్యప్ప స్వామి వారిని స్తుతించడం జరిగింది అప్పటినుండి స్వామివారి శరణు ఘోష నేటికీ ప్రతి ఒక్కరి హృదయంలో చిరస్థాయిగా నిలిచి పోవడం జరిగింది ఈ శరణుఘోష)


ఉదయానన్ తాను చేసిన అకృత్యాలకు చివరికి కుచ్చుకడుత్త చేతిలో ప్రాణాలు విడిచెను అయ్యప్ప సైన్యం కోటను ధ్వంసం చేసి సంపదను స్వాధీనపరుచుకున్నారు ఉదయనన్ మరణంతో అతని సైన్యం అంతయు అయ్యప్ప సేనలకు లొంగీ పోయి ప్రాణభిక్ష పెట్టమని అయ్యప్ప స్వామి వారిని శరణు వేడుకుంది

అయ్యప్ప స్వామి వారు వారిని విడిచిపెట్టి వారికి ప్రాణభిక్ష పెట్టి కరిమల నుండి సైన్యంతో శబరిమల పర్వతాలలో కొలువున్న  శబరిమల శ్రీ ధర్మశాస్త్ర ఆలయానికి ప్రయాణం చేయవలసిందిగా తన సేనలకు ఆదేశించినాడు


అందరూ భక్తి పారవశ్యంతో పరవశించిపోతూ ‘‘అయ్యప్ప స్వామికి జయము  హరిహరపుత్రుడు , ధర్మశాస్తా ,మణికంఠునికి జయముజయము  అంటూ జయజయధ్వానాలు కావించారు 

ఉదయనుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ప్రజాకంటకుడైన ఆ దుండగుడు మరణించడంతో వాతావరణం ప్రశాంతంగా మారింది చల్లని గాలులు వీస్తూ హాయిని కలిగించాయి హృదయాలకు  ఉదయనుడి మరణంతో బాధా భయాలు తొలగిపోయి తేలిక పడిన హృదయాలతో అందరూ అయ్యప్ప చుట్టూ చేరి స్తుతించారు.

పాహి పాహి అయ్యప్పా  శరణు శరణు అయ్యప్పా 

భక్తజనప్రియ అయ్యప్పా  శరణు శరణు అయ్యప్పా 

కలియుగ వరదా అయ్యప్పా  శరణు శరణు అయ్యప్పా పరమ కృపాళో అయ్యప్పా  శరణు శరణు అయ్యప్పా 

అందరి వైపు ప్రసన్నంగా చూస్తూ అక్కడనుండి పంబానదివైపు దారితీశాడు అయ్యప్ప 


రేపటి రోజున శబరిమల పున ప్రతిష్ట తదితర విషయాల గురించి తెలుసుకుందాం

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat