ఆర్య కేరళ వర్మ (అయ్యప్ప) పంబానది తీరాన్ని చేరి పరివారంతో అక్కడ విడిది చేశాడు ఆ ఒడ్డునే డేరాలు వేసి అయ్యప్ప కూర్చోవడానికి ఆసనం వేశారు పంబానది వాళ్ళను చూసి సంతోషంతో పరవళ్లు త్రొక్కుతూ ప్రవహిస్తున్నది గంగతో సమానమైన ఈ నది ఒడ్డున పితరులకు పిండ ప్రదానాలు చేయడం తర్పణాలు విడవడంవల్ల ఏడు తరాలవారికి సద్గతులు లభిస్తాయి మీరందరూ కూడా మరణించిన మీ పెద్దలనుద్దేశించి ఈ నదీ జలాలలో తర్పణాలు అర్పించండి అని అయ్యప్ప చెప్పడంతో పరివారంలోని వారందరూ భక్తిపూర్వకంగా తర్పణాలు అర్పించారు అయ్యప్ప చెప్పడంతో యుద్ధంలో మరణించిన యోధులకు కూడా తర్పణాలు విడిచారు
అయ్యప్ప అక్కడినుండి పందల రాజుకు
తన తల్లిదండ్రులకు (జయంతన్ శశికళ)ను పందల రాజ్యంలోని సమస్త ప్రజానీకానికి తన విడిదికి రావలసిందిగా దూతలతో వర్తమానం పంపించాడు వార్త అందిన వెంటనే వారు ఆనందోత్సాహాలతో బయలుదేరి పంబానదీ తీరాన్ని చేరుకున్నారు
పందల రాజు మరియు ఇతర బంధువర్గం ఉదయానన్ అయ్యప్ప సేన సంహరించి0దనిఅని తెలిసి ఆనందోత్సవాలతో సమస్త ప్రజానీకం అందరూ అయ్యప్పని వేనోళ్ల కొనియాడి అయ్యప్ప స్వామి వారి సైన్యాన్ని అభినందించారు ఉదయానన్ పీడ వదిలిన అందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు అయ్యప్ప సేన విజయాన్ని వారంతా పండగలా జరుపుకున్నారు వారి విజయానికి ప్రతీకగా పంబా నదిలో దీపాలు వెలిగించి నీటిలో వదిలి తమ బతుకుల్లో వెలుగులు నింపిన అయ్యప్ప దేవాది దేవుడుగా భావించి పూజలు చేశారు ఆ వేడుకని నేడు పంబ విలక్కు గా భక్తులు అందరూ జరుపుకుంటున్నారు అందరూ కలిసి శబరిమలకు బయలు దేరినారు
కుమారా అయ్యప్ప నిన్ను కన్న మేము ధన్యులమైనాము పందలరాజ్యం పాండ్య వంశం ధన్యమైనాయి కన్నులరా నిన్ను చూసే భాగ్యాన్ని మరొకసారి మాకు అనుగ్రహించావా తండ్రీ అంతకంటే మాకింకేం కావాలి నీకు సదా కృతజ్ఞులమై ఉంటాము చేతులు జోడించి అంటున్న వాళ్లను వద్దని వారించాడు అయ్యప్ప
మీరు పెద్దలు నాకు వందనీయులు నాకు కృతజ్ఞతలు చెప్పవలసిన అవసరం లేదు నేను వచ్చిన కార్యం పూర్తయింది ఇక నేను నా నివాసానికి బయలుదేరవలసిన సమయం ఆసన్నమైంది శబరిగిరి మీద నా నివాసానికి ప్రయాణం సాగించనున్న నా వెంట మీరు కూడా అంతవరకు రావచ్చును అంటూ చెప్పాడు అయ్యప్ప అందరినీ ఉద్దేశించి ఆ అయ్యప్ప స్వామి మాటలు అందరిలో ఆనందోత్సాహాలు కలిగించాయి
అయ్యప్ప స్వామి వారు తన అనుచరులను తీసుకుని పర్వతాన్ని అధిరోహించ ముందుకు కదిలాడు అయ్యప్పస్వామీ మీ వెంట మేమూ గిరిమీదకు వచ్చేందుకు అవకాశం ప్రసాదించావు ఎంతటి కరుణామయుడివి తండ్రీ అంటూ పరివారంలోని వారందరూ పందలరాజు పాండ్యరాజు జయవర్థనుడు ఆయన భార్య శశికళ అయ్యప్ప వెంట నడుస్తుండగా తాము వెనకగా అనుసరించారు
పంబా నదిని దాటి శబరిగిరి వైపు దారితీశాడు అయ్యప్ప
మార్గమధ్యంలో లో స్వామి వారు ఒక మర్రిచెట్టు వద్ద ఆగి
సైనికులారా మీ ఆయుధాలను ఈ అశ్వత్థవృక్షం దగ్గర వుంచి అందరూ భగవంతునిపై మనస్సు లగ్నం చేసి ముందుకు పదండి అదుగో ఆ కనిపిస్తున్న ఆలయమే శ్రీ ధర్మశాస్త్ర కోసం విశ్వకర్మ పరశురాములవారు నిర్మించినది ఉదయానన్ క్రూరత్వనికి నేలమట్టమైన ధర్మశాస్త్ర ఆలయం కొంతదూరంలో కనిపిస్తున్న ఆలయంవైపు చూపిస్తూ చెప్పాడు అయ్యప్ప
అలాగే స్వామి అంటూ అందరూ ఆయుధాలు అశ్వత్థ (రావిచెట్టు) వృక్షం దగ్గర భద్రపరిచి స్వామియే శరణం అయ్యప్ప అని శరణుఘోష గొంతెత్తి పాడుతూ ముందుకు సాగారు
అయ్యప్ప ముందు నడవగా అందరూ ఆలయాన్ని సమీపించారు ఉదయనుడి దాడులవల్ల ఆలయం దెబ్బతిన్నది పూజారులు అయ్యప్ప విగ్రహానికి పూజార్చనలు జరుపుతున్నా భక్తుల రాకపోకలు ఆగిపోయాయి ఆ ప్రాంతమంతా నిశ్శబ్ద తాండవమాడుతూ ఉన్నది అక్కడ కొంతకాలంగా
అయ్యప్ప పరివార సమేతంగా అక్కడకు చేరడంతో పరిసరాలలో చైతన్యం వచ్చింది ఎండిపోయిన చెట్లు చిగురించి ప్రకృతి కళకళలాడింది అయ్యప్పకు స్వాగతం చెబుతున్నట్లు జల జలమంటూ పుష్పవృష్టి కురిసింది స్వామిమీద
అయ్యప్ప చుట్టూరా ఒకసారి నిశితంగా పరిశీలించాడు ఆయన దృష్టి ఆలయం మీద కేంద్రీకృతమైంది అందరూ సంభ్రమాశ్చర్యాలతో చూస్తుండగా ఆలయం పునర్నిర్మింపబడి పూర్వపు శోభతో కలకలలాడింది పరశురాములవారు ప్రతిష్ఠించిన విగ్రహం యధాతథంగా దర్శనమిచ్చింది ఆయన నియమించిన పూజారుల వంశస్థులు పరుగు పరుగున వచ్చి అయ్యప్పకు స్వాగతం పలికారు
పద్ధెనిమిది మెట్లను చిన్ముద్రా అభయముద్రలు చూపుతూ పట్టుబంధంలో పీఠంమీద ఆసీనమై వున్న స్వామి విగ్రహాన్ని చూస్తూ అందరూ భక్తి పారవశ్యంతో మైమరచిపోయారు
రేపటి రోజు మరింత చరిత్ర తెలుసుకుందాం