#అయ్యప్ప_చరిత్ర_ధారావాహిక_9

P Madhav Kumar



ఆర్య కేరళ వర్మ (అయ్యప్ప) మణి మండపంలో యోగ ముద్రలొ ధ్యానం చేయుచున్న అయ్యప్పను చూసి అతనే ధర్మశాస్త్ర అయ్యప్ప రూపంగా అవతరించారని వేనోళ్ళ కొనియాడుతున్నారు

ఎన్నో వసంతాలు వేసిన శుభతరుణం ఆసన్నమైందని జయంతుని మనసు పులకరించి పోయింది పందల రాజు సమస్త పరివారంతో  స్వామి వారు ధ్యానము చేయుచున్న చోటికి చేరినారు

అచట జయంతుని మరియు అతని భార్యను చూసిన పందల రాజు ఆ జయంతుని భార్య తన సోదరి అని గుర్తించి ఇన్ని సంవత్సరముల తరువాత తన సోదరిని కలుసుకున్నందుకు మిక్కిలి సంతుష్టుడైనాడు జయంతుడి శ్రమకు సాధువు రూపంలో బిడ్డను అప్పగించిన అతని గా గుర్తించి తన సోదరి కుమారుడిని తాను తన కన్న బిడ్డ గా పెంచుకున్న సంగతి తెలిసి సంభ్రమాశ్చర్యాలకి లోనయ్యాను

ధ్యానము నుండి బయటికి వచ్చిన అయ్యప్ప తన కన్న తల్లిదండ్రులను మరియు పెంచిన తల్లిదండ్రులను పలకరించి తన జీవిత లక్ష్యం 

నెరవేరినది ఇక తన అవతారం చాలించేదానని  వారితో పలికెను

ఇన్నేళ్లకు తమ కుమారుని చూసినా అదృష్టం అప్పుడే తమని విడిచిపోతుంది అనడంతో అయ్యప్ప జన్మ కారకులైన జయంతుడు మరియు అతని భార్య ఎంతగానో విలపించసారు

పందల రాజు సైతం తమని విడిచి వెళ్ళవద్దని వేడుకొనెను స్వామివారు వారందరినీ ఊరడించి 

పందల రాజు తో మాలికాపురత్తమ్మ కి ఇచ్చిన మాట ప్రకారం ఆమెకు కూడా ఈ పక్కనే ఒక ఆలయం నిర్మించమని సూచించినాడు

మాలికాపురత్తమ్మ కి ఇచ్చిన మాట ప్రకారం రుతుక్రమంలో ఉన్న యువతులు స్త్రీలు తన దర్శనానికి రాకూడదని ఆదేశించెను

అలాగే ఆలయానికి ఎదురుగా 18 గుణాలకు ప్రతీకలుగా పదునెట్టాంబడి నిర్మించమని ఎవరైతే మండల కాలం పవిత్రమైన దీక్ష చేసి తనకు ఇష్టమైన నెయ్యిని ఇరుముడితో కట్టుకొని వస్తారో వారే ఈ పదునెట్టాంబడి ఎక్కే అర్హత సాధించగలరని సెలవిచ్చెను ఆ పదునెట్టాంబడికి రక్షకులుగా 

కరుప్పస్వామిని మరియు వలియ కడుత్తని నియమించారు కూచుకడుత్తకు కూడా తన ఆలయ ప్రాంగణంలో నివాసం ఏర్పాటు చేయమని చెప్పి తాను మరలా చిన్ముద్ర ధరించి  మణి మండపంలో ధ్యానము చేయసాగెను

పందల రాజు తన పరివారంతో త్వరితగతిన ఆలయ నిర్మాణం పూర్తి చేసేను మకర సంక్రాంతి రోజున జయంతుడు తన తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం ధర్మ శాస్త్రను తిరిగి వేదమంత్రాల సాక్షిగా గర్భగుడిలో ప్రతిష్టించేను 

స్వామియే శరణం అయ్యప్పా  అంటూ ముక్తకంఠంతో స్తుతించారు 

అయ్యప్పా నీ దయవల్ల ఈ రోజు మేమందరం ఈ మహిమాన్వితమైన ఆలయాన్ని  ఇందులో వెలసి వున్న అయ్యప్ప ను దర్శించగలిగాము నీకు మా కృతజ్ఞతలు ఏ విధంగా తెలుపుకోగలం తండ్రీ మా నమస్కారాలను స్వీకరించి మమ్మల్ని కృతార్థులను చేయి  అంటూ తమ వైపు చిరునవ్వుతో చూస్తూ నిలిచిన అయ్యప్పకు నమస్కరిస్తూ అన్నారందరూ !


‘‘నిర్మల హృదయంతో చేసిన నమస్కారం చాలు నాకు మీ యోగక్షేమాలు సర్వదా గమనిస్తూనే వుంటాను మీరందరూ దీక్షాధారులైనా సన్నిధికి రావచ్చును పద్ధెనిమిది మెట్లను ఎక్కి మీకు సన్మార్గాన్ని చూపడానికి  కలి పురుషునీ శనీశ్వరునీ ప్రభావానికి లోనుకాకుండా పుణ్యకార్యాలు ఆచరించి ఆత్మ సంయమనం పొందడానికి మండలదీక్ష ఎంతోగానో సహాయపడుతుంది గుర్తుంచుకోండి  అని చెప్పాడు మేఘ గంభీర స్వరంతో అందరూ భక్తిపూర్వకంగా తలలూపారు 

అయ్యప్ప లేచి సెలవు భక్తులారా  అని గబగబా మెట్లెక్కి వెళ్లి స్వామి విగ్రహం ముందు నిలిచాడు  ఒక దివ్య జ్యోతి అయ్యప్ప నుండి విగ్రహంలోకి ప్రవేశించి అదృశ్యమైంది అయ్యప్ప అదృశ్యమైనాడు  చూస్తున్న వాళ్లందరూ ఒక్కసారిగా స్వామియే శరణం అయ్యప్ప  శరణం అయ్యప్పా మా నమ్మకం నిజమని నిరూపించావు  మానవునిగా జన్మించి దుండగులందరినీ హతం కావించి మాకు శాంతిని ప్రసాదించిన అయ్యప్పవు నీకు కోటి కోటి ప్రణామాలు  అంటూ నమస్కరించారు 

అయ్యప్ప విలీనం కావడంతో మరింత జాజ్వలమానంగా ప్రకాశిస్తూ దర్శనమిచ్చింది  ప్రతిష్ఠింపబడిన  విగ్రహం 


(స్వామి వారు శబరిమలకు వచ్చిన నాటి నుండి దేవాలయం పూర్తి అయ్యేవరకు ప్రతిరోజు మణి మండపంలో కూర్చుని ధర్మశాస్త్ర వారిని ధ్యానము చేస్తుండేవారు స్వామి వారి ఆత్మ  శ్రీధర్మశాస్త్ర విగ్రహం లో ఐక్యం అయిన మరుక్షణం స్వామివారి దేహము అదృశ్యమైంది కనుక దయచేసి భక్తులందరూ మణి మండపము స్వామి వారి జీవ సమాధి కాదని వారి దేహం అదృశ్యమైందని భూలోక స్వర్గం మరియు యోగ పీఠం అయినా శబరిమల దేవాలయంలో సమాధి ఉండకూడదని ఉద్దేశంలో స్వామివారి దేహము అదృశ్యమైందని

మణిమండపము కేవలము స్వామి వారు ధ్యానము చేసిన చోటు అని స్వామి వారికి ఆనాడు సహకరించిన వంశీయులు నేటికి ఉన్నారని వారి ద్వారా స్వామి వారి చరిత్ర మనమందరము ఇంకా ఎంతో తెలుసుకోవాల్సి ఉందని గ్రహించగలరు)


స్వామి పూజా కార్యక్రమాలు నిర్వర్తించే పూజారులు విగ్రహాన్ని వివిధ ద్రవ్యాలతో పూజిస్తుంటే భక్తులందరూ మైమరచి చూడసాగారు అభిషేకాలు చేస్తూ అందువల్ల కలిగే ఫలితాలను కూడా తెలియచెప్పారు పూజారులు (తంత్రులు)

ధర్మశాస్త్రాలో ఐక్యమైన అయ్యప్పను శ్రీ ధర్మశాస్త్ర అవతారంగా గుర్తించి ప్రజలందరూ శబరిమలను తాము ఎంతో ఇష్టంగా పిలుచుకునే (అయ్యా అప్ప)

అయ్యప్ప దేవాలయముగానే భావించి ఆనాటినుండి పూజించడం మొదలు పెట్టారు అలా ధర్మశాస్త్ర ఆలయం అయ్యప్ప ఆలయంగా ప్రజలచే నేటికీ పిలవబడుతున్నది

అయ్యప్ప అంతర్ధానంతరము వాలియాకడుత్త మరియు కరుప్పస్వామి ఆ క్షేత్రానికి రక్షకులుగా ఉన్నారు కూచుకడుత్త సైతం స్వామివారి సేవ చేసుకుంటూ అక్కడే తన శేష జీవితాన్ని గడిపినారు వారి సేవలను గుర్తుగా స్వామివారి పదునెట్టాంబడి కి ఇరువైపులా కరుప్పస్వామి మరియు కుచూకడుత్త విగ్రహాలను ప్రతిష్టించడం జరిగినది ఆ ఆలయ ప్రాంగణంలోనే కూచుకడుత్తకు సైతం ఆలయం నిర్మించారు ఇది మనం మాలికాపురత్తమ్మ ఆలయ సమీపంలో దర్శించవచ్చును

అయ్యప్ప స్వామి మరియు వావర్ స్నేహానికి గుర్తుగా ఎరిమేలి వావర్ స్వామికి ఒక ఆలయాన్ని నిర్మించారు

అలా అయ్యప్ప సేవలో తరించిన వారి భక్తులకు కూడా శబరిమల లో ప్రముఖ స్థానం లభించింది

రేపటి రోజున మరింత చరిత్ర తెలుసుకుందాం

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat