23. గల్లు గల్లున రావేమయ్యా గణేశా - Gallu galluna ravemaiah Ganesha -వినాయక భజన పాటల లిరిక్స్
April 26, 2024
గల్లు గల్లున రావేమయ్యా గణేశా
మా పూజలందుకో వయా గణేశా
పార్వతమ్మ పుత్రుడవు గణేశా
మమ్ము పాలించగ రావయా గణేశా
కళియుగ వరదుడవే గణేశా
మమ్ము కరుణించగ రావయా గణేశా
ముగ్గురన్నదమ్ములట గణేశా
నీకు ముందుగానే పూజలట గణేశా
ఆది దేవుడవయ్యా గణేశా
నీవు అగ్రపూజలందుకోవయా గణేశా
ఎలుక వాహనుడా గణేశా
మమ్ము ఏలుకోనగ రావేమయా గణేశా
ఆరు ముగ సోదరుడవే గణేశా
మమ్ము ఆదుకొనగ రావేమయా గణేశా ||గల్లు||
ఈ పాట ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి చూడండి.
Tags
