🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*గురునాధునికి గురోపదేశము*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
*అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి (ABADPS)*
*'గురు సాక్షాత్ పరబ్రహ్మ'* అనునది దైవవాక్కు దైవాంశ సంభూతుడే అయిననూ గురువు యొక్క
ఉపదేశము తప్పక ఉండవలెను కదా !
శివపుత్రులైన వినాయకుడు , సుబ్రమణ్యుడు , శాస్తా , భైరవుడు వీరంతా సాక్షాత్తూ శివస్వరూపులే.
వారికి తెలియనిది ఏదీ లేదు కదా. అయిననూ గురువు యొక్క ఉపదేశమునకున్న మహిమ లోకులకు తెలియవలసిన , తెలుపవలసిన అవసరమున్నది కదా !
ముల్లోకములకూ సృష్టి , స్థితి , లయకారకుడై పరిపాలించు విధి యొక్క మరుస్వరూపుడైన శాస్తా
నేర్చుటకొనుటకు ఇంకనూ ఏమున్నవి ?
కానీ గురువు అనువాడు పరబ్రహ్మ స్వరూపుడను మాట నిజము చేయవలెను కదా ! అందులకై గురునాధుడైన శాస్తా తన తండ్రియైన పరమశివునే గురువుగా నెంచుకొనెను.
ఒకనాడు పార్వతీదేవి , శివపుత్రులతో చేరి , కైలాసనాధునికి నమస్కరించి గురువుందరికీ గురువైన తామే మాకందరికీ వేద , ఆగమముల పరమార్ధమును బోధింపవలయునని ప్రార్థించెను.
అది విన్న పరమశివుడు చిరునగవు నవ్వుతూ తన ఆసనము నుండి లేచి , కైలాస పర్వతమునందలి
పుష్పగిరి యను పర్వతమును అధిరోహించి , గంభీర రూపుడైన గురువుగా రూపుదాల్చి సాక్షాత్కరించెను.
తన సగభాగమైన అంబిక , తన ప్రియ పుత్రుడైన గణపతి , స్కందులు , మహాశాస్తా , భైరవుడు , తన మరుస్వరూపుడైన గణముల కధిపతియైన వీరభద్రుడు ఇలా అందరినీ ఏకాంతముగా రప్పించి , పుష్పగిరి పర్వత శిఖరముపై పరమాశ్చర్యమూర్తియై సాక్షాత్కరించి , వేద ఆగమముల అంతరార్ధమును బోధించెను. తన ప్రియ పుత్రుని కౌగిలించుకొని , ముద్దాడి , తన ఒడిలో కూర్చుండబెట్టి , జ్ఞానోపదేశము
గావించెను.
*ఉత్తాయ చ దదా శంభు రాసనాత్ తత్ర ప్రవతే*
*పుష్ప గిర్యాఖ్య శృంగేస్థి గృహం సర్వ మనోహరం*
*తత్రాస్థాయ వపుచ్ఛం పురాచార్యస్ మాది పేశలం*
*దేవీ ద్వైమాతుర స్కంద శాస్తు భైరవ భూతవాస*
*వీరభద్రాది గణపాన్ లేదాగమ శ్రాంసి చ*
*అధ్యాపయామాస విభుః పరమాశ్చర్య మూర్తిమాన్*
ధర్మస్వరూపియైన స్వామి ధర్మ పరిపాలన చేయనెంచెను. తప్పు చేసినవారు ఏ కులస్థుడైననూ
వారిని వారించి , నీతి పరిపాలన గావింపచేసెను.
బాల్యావస్థయందే దుష్టశిక్షణ , శిష్ట రక్షణను గావించెను. మేరు పర్వత శిఖరము పై అమిత
తేజస్సుతో వెలుగొందు హరిహరసుతుని చూసిన వారందరూ ఆనంద పరవశులైరి.
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*
*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*
*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*
*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*
*లోకాః సమస్తా సుఖినోభవంతు*