🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*సర్వజ్ఞ పీఠము నందు సర్వేశ్వరుడు*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
*అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి (ABADPS)*
దేవలోక వాసులు కూడా జీవులే కదా ! వారు కూడా ముక్తి చెందుట సహజమే. మానవ
జీవితము వలెనే అమరుల జీవితము కూడా శాశ్వతము కాదు. పరమాత్మునిలో ఐక్యము కాగల మోక్ష స్థితి మాత్రమే శాశ్వతమైనవి. కానీ ఇది తెలియని అమరులందరూ ఆత్మసాధనను , జ్ఞానసముపార్జన
చేయ భోగలాలసులై యుండిరి. వేద స్వరూపుడైన స్వామి , పరమ పవిత్రమైన వేదములు బోధించు
నగ్నసత్యములు గ్రహించలేని అజ్ఞానములో అమరులు మునిగియుండుటను గమనించెను.
తన బాల లీలా వినోదయములు చేయుచూ ముల్లోకములు సంచరించుచూ లీలా వినోదధారిగా దేవలోకమునకేగెను.
పలు రక్కసుల బారినుండి తప్పించువాడు ఇతడే నని గుర్తించిన దేవేంద్రుడు స్వామికి స్వాగతమిచ్చి ఉపచరణులను చేసెను. కానీ అజ్ఞానమను చీకటిలోనే ఉన్నవాడు అతను. వయస్సు
నందు చిన్నవాడే కదా అను సందేహము తోచినది.
స్వామి ఇదంతయూ గమనించిననూ , గమనించనటుల నటించుచూ దేవగురువైన బృహస్పతితో
*'వేదములు బోధించు సత్య స్వరూపములు'* ఏవి ? అని ప్రశ్నించెను.
దేవగురువు తనకు తెలిసినంతలో చెప్పబోయెను. కానీ దాన్ని ఆమోదించని విధంగా అభ్యంతరము తెలుపుచూ ఉపదేశము గావించెను.
సందేహమునకు , మరొక అభిప్రాయమునకు తావే లేని విధముగా శాస్తా అద్వైత సత్యమును
బోధించెను.
జీవాత్మ అనునది పరమాత్మ యొక్క మారుపేరే తప్ప వేరొకటి కాదు అంటూ , సర్వాత్మ
భావమును బోధించెను. ఇది విన్న అమరులందరూ సిగ్గుతో తలలు దించుకొనిరి. శాస్తా యొక్క పాదములను తాకి నమస్కరించిరి.
వేదనాయకుడైన స్వామి యొక్క ఉపదేశములను వినుటకు , స్వామిని చూచుటకు ఋషులు ,
మునులు గుమిగూడిరి.
తపసంపన్నులైన ఋషులు స్వామిని సేవించి జ్ఞానోపదేశమును సెలవీయమని కోరిరి.
తన తండ్రి తనకు బోధించినది స్వామి వివరించెను.
ఆనాడు సనకాది మహామునులకు లభించిన పుణ్యము వలెనే తమకు కూడా లభించినవి కదా యని సంతసించిన మునిపుంగవులు. స్వామిని వ్యాఖ్యాన పీఠము నందు అమరచేసి నమస్కరించిరి. స్వామి చిన్ముద్ర ధరించిన పరమ గురువుగా కుడిచేయిని పైకెత్తి ఆశీర్వదించెను. సకల తత్వములకు
అతీతుడై వెలుగొందు శాస్తా తత్వమసి స్వరూపునిగా భాసించెను. తపసంపన్నులైన ఋషి పుంగవులను
తన్మయనందమున తేలునట్లు చేసెను. స్వామియొక్క దివ్య ప్రకాశతత్వము ముల్లోకములకూ
వ్యాపించెను.
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*
*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*
*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*
*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*
*లోకాః సమస్తా సుఖినోభవంతు*