శ్రీ మహాశాస్తా చరితము - 37 విశ్వేశ్వర శాస్తా * బాలశాస్తా యొక్క అవతారము*

P Madhav Kumar

*విశ్వేశ్వర శాస్తా*


*బాలశాస్తా యొక్క అవతారము*

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️

*అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి  (ABADPS)*


ఒకప్పుడు వింధ్య పర్వత ఛాయలలో అమరియున్న పద్మపురి అను నగరమును మకుటాసురుడు అను రాజు పాలించుచుండెడివాడు. తన తపశ్శక్తి ప్రభావముతో బ్రహ్మ , విష్ణువు మొదలగు వారిని
సైతము యుద్ధమున ఓడించి , వారి లోకములనుండి ఐశ్వర్య సంపదలను తన నగరము అయిన
పద్మపురికి చేరవేసి ఏకఛత్రాదిపత్యము చేయుచుండెడివాడు. ఇతడికి భయపడిన ఇంద్రుడు సైతము
హిమవత్ పర్వతము గుహలయందు దాక్కుని , అజ్ఞాత వాసము చేయుచుండెను.

పద్మపురికి కొంచెము దూరముగా *'అమరేశ్వరము'* అను గ్రామమున పుణ్యకీర్తి , జ్ఞాన సుందరి యను బ్రాహ్మణ దంపతులు నివశింససాగిరి. వారిరువురూ పరమ శివ భక్తులై , నిత్యమూ
మహాశాస్తాని ఉపాసించువారు. వారిరువురుకు ఉన్న లోటు ఒక్కటే. తమ తదనంతరము శాస్త్రాని
కొలుచుతున్న సంతానము లేదే యనునదియే.

మునుపటి జన్మలోనూ వీరిరువురూ శాస్తా భక్తులై అతడి అనుగ్రహము పొందినవారే. తరువాత
జన్మలో సాక్షాత్తూ మహాశాస్తావే వారికి తనయునిగా జన్మించు వరమును పొందిన వారు.

ఒకనాడు వారు *జ్ఞాన స్వరూపుడైన మహాశాస్తా* ఆలయమునకు వెళ్ళి స్వామికి పూజలు
చేయుయుండిరి.  మునుపటి జన్మమున వారికి తనయునిగా జన్మించి , రాక్షససంహారము చేయు
సమయము ఆసన్నమైనది.

*"బ్రాహ్మణ దంపతులారా ! వ్యధ చెందకుడు. మీ భక్తికి మిచ్చి మీ తనయునిగా పెరిగి పెద్దవాడనగుదును. మీరు ఇంటికి తిరిగి చేరు సమయమున నేను మీ ఇంట ప్రత్యక్షమగుదును”* అని స్వామి యొక్క కంఠము మారుమ్రోగెను.

ఇది విన్న దంపతుల కళ్ళలో ఆనంద భాష్పముయిప్పొంగుచుండగా వేగిరముగా తమ
గృహమునకు పరుగెత్తిరి.

గృహమునందు ఊయలలో తేజోవంతుడై , పరబ్రహ్మ స్వరూరుడైన శాస్తా బాల శిశువుగా పరుండియుండి ఏడ్చుచుండెను (గుక్కపెట్టి) పులకాంకితులై , ఆనంద భాష్పములు దంపతుల
జాలువారెను. భగవత్ కృపవలన జ్ఞాన సుందరి యొక్క స్తనముల నుండి ఆకస్మాత్తుగా క్షీరము
స్రవించుచుండెను. ఏడ్చుచున్న శిశువునకు ఆ మాతృమూర్తి తన స్తనముల నుండి స్రవించు
క్షీరముతో కడుపు నింపెను. లోక నాయకుని ఆకలి తీర్చిన ఘనత ఆ తల్లికి దక్కినది. ఎంత
పుణ్యమో కదా !

*‘విశ్వేశ్వర' నామధేయుడై , శాస్తా దిన దినాభివృద్ధి నొందుతూ పెరుగసాగెను.*

ఆ శిశువు రెండేళ్ళ వయసువాడై ఉన్న సమయమున ఒకనాడు దంపతులిరువురూ పార్వతీ పరమేశ్వరులకు నివేదన చేయుటకై పలు విధములైన నైవేద్యములు చేసి పూజించుచుండిరి. ఎదురు చూడని విధముగా ఆ బాలుడు తటాలున పూజకై నివేదింపబడియున్న ఫలహారములను భుజింపసాగెను. నివ్వెరపడిన ఆ దంపతులు బాలునితో *“శివ పార్వతులకై నివేదనకై తయారు చేయబడిన పదార్థములను భుజించుట తగునా ? ఇది దేవతలు క్షమింతురా?”* అని ప్రశ్నించిరి. అందులకు ఆ బాలకుడు *“మీరు
కోరినట్లుగానే , ఆ శివ పార్వతులే భుజించుచున్నారు. చూడుడు అంటూ తన నోరు తెరచి చూపగా
వాని నోటిలో శివ పార్వతులు నైవేద్యమును ఉల్లాసముగా , ప్రీతిగా ఆరగించుటయూ కానవచ్చెను.

ఆ దృశ్యమును గాంచిన దంపతులు పరమానందము నొంది *"ప్రభూ పరబ్రహ్మ స్వరూపుడవైన నీవు మా తనయునిగా అవతరించిన వైనము మరిచి , మామూలు బాలకుని రీతి మిమ్ము మందలించిన మమ్ము మన్నింపుము. మా అజ్ఞానమును క్షమింపుము. మిమ్ము తృప్తి పరచినచో సకల దేవతలనూ తృప్తిపరచినట్లే నను సత్యమును గ్రహించునటుల చేసితిరి. మా తనయునిగా మీరు అవతరించుటకు మేమెంత పుణ్యము చేసుకుంటిమో కదా”* అని ఆనందించిరి.



*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*

*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*

*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*

*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*

*లోకాః సమస్తా సుఖినోభవంతు*


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat