మల్లెపూల గణపతి వందనమయా - వినాయక భజన పాటల లిరిక్స్

P Madhav Kumar


*పల్లవి :*

మల్లెపూల గణపతి వందనమయా 

మామంచి గణపతి దండాలయా    || కో ||


మహాగణపతికి వందనమయా మమ్మేలు స్వామికి దండాలయా   ||కో||

కోటికోటిదండాలయ్యా గణపయ్యనీకు శతకోటి వందనాలయా   ||కో||

చిరునవ్వుతొ చల్లగచూసి నీ భక్తులను అభయమిచ్చి ఆదుకోవయా  ||కో||    ॥మల్లె॥


చరణం - 1 : 


ముందునిన్నే పూజింతుమయా ముద్దులొలికే ముక్కంటితనయా

గణేశ శరణం శరణు గణేశా శరణం శరణం వినాయకా 

పాపనాశక పార్వతి తనయా పాదపూజలు గైకొనుమయ్యా

గణేశ శరణం శరణు గణేశా శరణంశరణం వినాయకా 


విఘ్నాలను తొలగించు విఘ్నేశ్వర దేవుడా  ||కో||

అభయమిచ్చి ఆదుకోర అంబికా పుత్రుడా   ||కో||


నమ్మికొలచినవారికి బంగారు కొండవురా 

గణపతి పప్పాయోరియా 


॥మల్లె||


చరణం -2 


శ్రీశైలంలో సాక్షి గణపతి కాణిపాక మహా గణపతి

గణేశ శరణం శరణు గణేశ శరణం శరణం వినాయకా 

శబరిమలలో కన్నిమూల గణపతి కాళహస్తిలో పాతాళ గణపతి

గణేశ శరణం శరణు గణేశా శరణం శరణం వినాయకా 


భక్తులకువరము లిచ్చు బంగారు గణపతి   ||కో||

సిద్ధిబుద్దిని ఇచ్చే వరసిద్ధి గణపతి     ||కో||


తొలిపూజలందుకోర శ్రీలక్ష్మీగణపతి

గణపతిపప్పా మొరియా


||కో||  మల్లెపూల గణపతి వందనమయా 

మామంచి గణపతి దండాలయా 


మహాగణపతికి వందనమయా మమ్మేలు స్వామికి దండాలయా 

కోటికోటిదండాలయ్యా గణపయ్యనీకు శతకోటి వందనాలయా   ||కో||

చిరునవ్వుతొ చల్లగచూసి నీ భక్తులను అభయమిచ్చి ఆదుకోవయా  ||కో||  


గణపతిపప్పా - మొరియా

విఘ్నవినాయక - మొరియా

మూషికవాహన - మొరియా

మొరియారేపప్పా - మొరియా




ఈ పాటను ఎలా పాడాలి ఇక్కడ టచ్ చేసి చూడండి.


*స్వామియే శరణం అయ్యప్ప*



#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat