గణనాథ ఏలుమయ ఎంతటి చల్లని స్వామివయా..
భజియింతు నీ నామమే దేవా - పాలించ రావేమయా.. || కోరస్ ||
గణనాథ ఏలుమయ ఎంతటి చల్లని స్వామివయా..
భజియింతు నీ నామమే దేవా - పాలించ రావేమయా..|| గణ నాథ||
అనతీ తల్లిది నువ్వు వినగానే - ఆజ్ఞకై నిలచి ఉంటివి స్వామి
అనతీ తల్లిది నువ్వు వినగానే - ఆజ్ఞకై నిలచి ఉంటివి స్వామి ||కోరస్||
శివుడే వచ్చిన బెదరక నీవు - శక్తి తోడ నీవే ఎదిరించినావే
శివుడే వచ్చిన బెదరక నీవు - శక్తి తోడ నీవే ఎదిరించినావే ||కోరస్||
ఎంతటి వీరుడ నిన్నూ మరువజాలం - ఏమని పొగడము నీ లీల సారం
నేనంత వాడనయా దేవా పాలించ రావేమయా ||గణ నాథ||
నీ పుణ్య నామము తలచిన చాలు - నిను కొలిచిన స్వామి కలుగు మేలు
నీ పుణ్య నామము తలచిన చాలు - నిను కొలిచిన స్వామి కలుగు మేలు||కోరస్||
నీ బొజ్జ రూపం ఆనంద తేజం - భవ సాగరముల దొరుకును తీరం
నీ బొజ్జ రూపం ఆనంద తేజం - భవ సాగరముల దొరుకును తీరం||కోరస్||
ప్రతి దినం నిన్ను తలచిన వాళ్ళం - పాడుకొందుము ప్రభు నీదు నామం
మా ఇలవేల్పువయా స్వామి లాలించ రావేమయా ॥గణ నాథ|
ఈ పాటను ఎలా పాడాలి ఇక్కడ టచ్ చేసి వినండి.
*స్వామియే శరణం అయ్యప్ప*