గణపయ్య స్వామి గణపయ్య ఘల్లు ఘల్లుమంటు ఉరికి రావయ్య
గణపయ్య స్వామి గణపయ్య ఘల్లు ఘల్లుమంటు ఉరికి రావయ్య
ఎలుక వాహనమెక్కి ఏలుకొందువని ఎదురు చూస్తున్నాము లేవయ్య
పాలవెల్లిని కట్టి పాయశాలను వండి సిద్ధంగ ఉంచాము రావయ్య
పాలవెల్లిని కట్టి పాయశాలను వండి సిద్ధంగ ఉంచాము రావయ్య ||కోరస్||
పసుపుతో చేసింది నీ తల్లి నీకు ప్రాణమే పోసింది భూ తల్లి
పసుపుతో చేసింది నీ తల్లి నీకు ప్రాణమే పోసింది భూ తల్లి |కోరస్||
కన్నతండ్రిని నీకు ఎదిరించే శక్తిని నూరి పోసిందయ్య గౌరమ్మ
నిన్ను మించిన వాడు జగతిన లేడంటూ దీవించ వచ్చాడు బ్రహ్మయ్య
నిన్ను మించిన వాడు జగతిన లేడంటూ దీవించ వచ్చాడు బ్రహ్మయ్య ||కోరస్||
ఘోర తపము చేసే రావణుడు మెచ్చి ఆత్మలింగమునిచ్చే ఈశ్వరుడు
ఘోర తపము చేసే రావణుడు మెచ్చి ఆత్మలింగమునిచ్చే ఈశ్వరుడు ||కోరస్||
గోవుల్లు కాసేటి గొల్ల పిల్లాడిలా రావణున్ని నమ్మించినావయ్య
చేతనిచ్చిన ఆత్మలింగాన్ని నీవు భూ తల్లి వడినేసినావయ్య
చేతనిచ్చిన ఆత్మలింగాన్ని నీవు భూ తల్లి వడినేసినావయ్య ||కోరస్||
నీ శాపాన్ని పొందాడు చంద్రుడు కాని పాలల్లో చూశాడు కృష్ణుడు
నీ శాపాన్ని పొందాడు చంద్రుడు కాని పాలల్లో చూశాడు కృష్ణుడు
దేవ దేవుడికైన తప్పలేదు స్వామి అపనింద పాలైనాడయ్య
దేవుళ్లకే నీవు దేవుడైయున్నావు మోక్షాన్ని మాకియ్య రావయ్య
దేవుళ్లకే నీవు దేవుడైయున్నావు మోక్షాన్ని మాకియ్య రావయ్య||కోరస్||
||గణపయ్య స్వామి||
లిరిక్స్ పంపించినవారు:
*వై. వెంకటసుబ్బారెడ్డి స్వామి*