బాలా త్రిపురసుందరీ గైకొనుమా హారతీ ||2||
గాన లోల జాలమేల జాలిచూపుమా ||2||సుందరాంగీ అందరూ నీసాటిరారుగా ||2||
సందేహములు అందముగా తీర్పుమంటివి ||2|| ||బాలా||
వాసికెక్కియున్న దానవనుచు నమ్మితి ||2||
రాశిగ సిరిసంపదలునిచ్చి బ్రోవుమంటివి ||2|| ||బాలా||
ఓం, హ్రీం, శ్రీం అనుచు మదిని తలచు చుంటిమి ||2||
ఆపదలెడ బాపవమ్మ అతివ సుందరి ||2|| ||బాలా||
స్థిరముగ శ్రీ కడలియందు వెలసితివమ్మ ||2||
ధరణిలో శ్రీరంగదాసుని దయను చూడుమా ||2|| ||బాలా||