Bhramaramba Devi Haarathi Song | భ్రమరాంభ దేవి హారతి పాట
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

Bhramaramba Devi Haarathi Song | భ్రమరాంభ దేవి హారతి పాట

P Madhav Kumar

పత్తితో నీ పాదమమ్మా వత్తి సేవలు చేసెదమమ్మా
చిత్తగించు శ్రీశైలం మల్లికార్జున భ్రమరాంభమ్మ
ఎప్పటికైనా మాతోవుంటే నీకుసేవలు చేసెదమమ్మా
గంగనీళ్ళు తెచ్చేమమ్మ గౌరమ్మను చేసెదమమ్మా ||పత్తితో||

కుందనంపు నీ నొష్టికి కుంకుమలైనా దిద్దేమమ్మా
కల్వపూల నీ కండ్లకు కాటికలైనా తీర్చేమమ్మా
బూని బూని భుజములనడుమ బుక్కలైనా చల్లేమమ్మా
చేరి చేరి చెక్కిళ్ళ నడుమ చంద్రమైనా అద్దేనమ్మా ||పత్తితో||

వత్తి పత్తి పెట్టేమమ్మా
పండ్లు పలహారాలు ఇచ్చేమమ్మా
పత్తితో నీ పాదమమ్మా వత్తి సేవలు చేసెదమమ్మా
చిత్తగించు శ్రీశైలం మల్లికార్జున భ్రమరాంభమ్మ

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow