ఏమి చేతయ్య లింగ ఏమనందయ్య బసవ - శివ భజన పాటల లిరిక్స్

P Madhav Kumar

 ఏమి చేతయ్య లింగ ఏమనందయ్య బసవ

 ఏమి చేసిన నీదు మాయ ఎవరికీ తెలియ దాయెను 

 //ఏమి//

1) గంగజలము తెచ్చి నీకు అభిషేకం చేతమంటే

గంగలున్న చేప పిల్లలు ఎంగిలి అంటున్నాడు శివుడు

 //ఏమి//

2) కాటి ఆవుల పాలు తెచ్చి పాల పూజచేత మంటే

ఎంట ఉన్నా లేక దూడలు ఎంగిలి అంటున్నాడు శివుడు

 //ఏమి//

3)  పట్టు తేనె తెచ్చి నీకు అభిషేకం చేతమంటే

తేట్టకున్న తేనేటీగలు ఎంగిలి లంటున్నాడు శివుడు

 //ఏమి//

4)  మంచి మల్లెలు తెచ్చి నీకు అభిషేకం చేతమంటే

ఎంటనున్న కీటు పురుగులు ఎంగిలి అంటున్నాడు శివుడు

 //ఏమి//

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat