ఓ రామ నీ నామము ఎంత మధురమో
ఎంత మధురమో దేవా ఏమి మధురమో || 2 ||
చరణము :- 1
ఎనలేని నీ నామము ఎన్ని సార్లు పలికినా
అలుపురాని నామము పలికినా చాలును
పాపాలను బాపేతి పరమ పుణ్య నామము
మరువలేమయా దేవా మరపురాదాయా
ఓ రామ నీ నామము ఎంత మధురమో || 2 ||
చరణం : 2
కౌశిక యాగమును కాచినట్టి నామము
వరమున వలిడగా మార్చిన నామము
రావణాది రాక్షసుల హత మార్చిన నామము
మరువలేమయా దేవా మరపురాదాయా
ఓ రామ నీ నామము ఎంత మధురమో || 2 ||
చరణం : 3
భక్తి ముక్తి దాయకం సర్వలోక నామము
పదునాలుగు లోకాలు పాలించే నామము
ఆపదలను బాపేతి అభయమిచ్చు నామము
మరువలేమయా దేవా మరపురాదాయా
ఓ రామ నీ నామము ఎంత మధురమో ఎంత మధురమో దేవా ఏమి మధురమో || 2 ||