కానిపాకంలో వెలసిన గణపయ్య స్వామి
నీకు ఎన్ని నామాలయ్య గణపయ్య స్వామి
సిద్ది బుద్ది నీయవయ్య గణపయ్య స్వామి
నీకు కోటికోటి దండాలయ్య గణపయ్య స్వామి ||2||
బాద్రపద చవితినాడు ముందు పూజ నీకయ్య
జై గణేష జై జై గణేష
గరికలు, దర్భాలతోన పూజలెన్నో చేశాము
జై గణేష జై జై గణేష
కుడుములు ఉండరాళ్ళు, గారెలు బూరెలతోడ
జై గణేష జై జై గణేష
పులిహోర, పొంగళితో పాయసాలు చేసాము
జై గణేష జై జై గణేష
వడపప్పు బెల్లంతో నైవేద్యం పెట్టినాము
జై జై జై జై
కానిపాకంలో వెలసిన గణపయ్య స్వామి
నీకు ఎన్ని నామాలయ్య గణపయ్య స్వామి
నలుగు పిండితో నిన్ను బొమ్మనే చేయంగా
జై గణేష జై జై గణేష
ద్వారముందు నీ తల్లి కాపలాగా ఉంచెనంట
జై గణేష జై జై గణేష
మహా శివున్ని ఎదురించి లోపలికి వెళ్ళకుండా
జై గణేష జై జై గణేష
కోపంతో నీ శిరస్సును ఖండనము చేయగా
జై గణేష జై జై గణేష
నీ తల్లి వేడుకొనగా గజాణుని రూపమిచ్చే
జై జై జై జై
కానిపాకంలో వెలసిన గణపయ్య స్వామి
నీకు ఎన్ని నామాలయ్య గణపయ్య స్వామి
ముల్లోకాలన్నింటికి ఆది పూజ్యుడెవరంటూ
జై గణేష జై జై గణేష
అన్నదమ్ములిద్దరికీ ఆదిపత్య పోరు పెట్టే
జై గణేష జై జై గణేష
నారాయణ మంత్రం నామాలు చెప్పుకుంటూ
జై గణేష జై జై గణేష
తల్లిదండ్రుల చుట్టు తిరిగి పోటీలో గెలవంగ
జై గణేష జై జై గణేష
ఆది గణములకు నీవు ఆదిపతివైనావు
జై జై జై జై
కానిపాకంలో వెలసిన గణపయ్య స్వామి
నీకు ఎన్ని నామాలయ్య గణపయ్య స్వామి
గణేష్ మహారాజ్ కి - జై