లక్ష్మీదేవి హారతి పాట - Lakshmi Devi haarathi song - Telugu Lyrics - Goddess Lakshmi

P Madhav Kumar


లక్ష్మీ రావమ్మా మా ఇంటికి

శ్రీ రాజపుత్రి వరలక్ష్మీరావమ్మా మా ఇంటికీ

లక్క్ష్మీ పార్వతీ వాణీ రావమ్మా మా ఇంటికీ


సంపెంగ తైలముతెచ్చి సొంపూగ సిరసూలనంటి

మెత్తానీ కస్తూరీదెచ్చి మేగా పెట్టించెదనమ్మా ||లక్ష్మీ||


అందామైనా గవ్వంచుల చీరబంగారు కొంగోళ్ళరైక

అండా అండా చిలుకలు చెక్కి

ఆభరణాల సొమ్ములు పెట్టి అలంకరించెదమమ్మా ||లక్ష్మీ||


చాయాపసుపు దీర్చేనమ్మా మంచి గంధం పూసేనమ్మా

మల్లెలు ముడిచేనమ్మా

అతివరో గౌరమ్మా నీకు అద్దమ్ము చూపించెదనమ్మా ||లక్ష్మీ||


సితిలేని సీతాఫలము మతిలేని మామిడిఫలము

కోరీనా కొబ్బరి ఫలము

అడిగీనా అరటిఫలము పనసా పండైనాగానీ 

 వేళా మా ఇంట్లో నీకు నైవేధ్యము సరిపించెదనమ్మా ||లక్ష్మీ||


గౌరమ్మను తోలుకవచ్చి కుందానంపు

గద్దేమీదా అందూ కూర్చుండా బెట్టీ 

ఆకులు పోకలు చేతికి ఇచ్చి ఎప్పటికీ 

మా ఇంట్లొ ఉంటే తప్పాకా పూజించెదనమ్మా ||లక్ష్మీ|| 

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat