మంగళ గౌరి హారతి పాట - Mangala Gowri Haarathi Song

P Madhav Kumar
0 minute read

  దేవీ మంగళ గౌరి మంగళ హారతి ప్రేమతో గైకొనవమ్మ మాయమ్మ

 దేవీ మంగళ గౌరి మంగళ హారతి ప్రేమతో గైకొనవమ్మ మాయమ్మ


పంచామృతములుఫలహారములను 

నైవేద్యములిచ్చితిమి

పలుపలు విధముల పకువన్నములను

ప్రేమతో సమకూర్చితిమి, 

నీకొరకై ప్రేమతో సమకూర్చితిమి

 మాతా విను మా గాధా 

మా కోరికలన్నియు తీర్చుమా 

గైకొనవమ్మ మాయమ్మ ||  దేవీ ||


సకల సుఖములనుసౌభాగ్యములను 

ఒసగుము  జననీ

శుభసంతానమునిచ్చియు కరుణించుము కదలమణి

దయగనుమమా మొర వినుమా 

ఇక పాతివ్రత్యము నీయుమ

గైకొనవమ్మ మాయమ్మ ||  దేవీ ||


భవభయహారిణివరదాయనివని

జనులందరు కొలిచెదరు

సంతతి ధారిణి దుఖః నివారిణి 

మనసున పూజించెదరు 

మృదువాణిపంకజపాణి 

గొవిందుని హృదయ నివాసిని

గైకొనవమ్మ మాయమ్మ ||  దేవీ ||

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat