Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

సత్యనారాయణా స్వామి హారతి పాట - Satyanarayan Swami Haarathi Paatalu - 3 Songs - Telugu Lyrics

P Madhav Kumar

 

సత్యనారాయణా స్వామి హారతి పాట - 1
=========


సత్యనారాయణా స్వామికి మనమంతా నిత్యామంగళమానరే,

ఓ జనులారా సత్యామంగళామానరే ||సత్యనారాయణా||


ఆవుపేడలు తెచ్చి పచ్చాటి కళ్ళాపీచల్లి

పగడిముగ్గులు వేయారే, ఓ జనులారా పగడిముగ్గులు వేయారే ||సత్యనారాయణా||


తట్టుపీటలు తెచ్చి, పట్టుబట్టలు పరచి

సన్న బియ్యముపోయరే, ఓ జనులారా సన్న బియ్యముపోయరే ||సత్యనారాయణా||


ఛెంబు కలశముగట్టి, టెంకాయ పూజా చేసి

ఒంగి దండముచేయరే, ఓ జనులారా ఒంగి దండముచేయరే ||సత్యనారాయణా||


అర్ధశేరు గోధుమ రవ్వ, తీనుపావు పంచాదారా 

పండ్లుఫలహారములు కలుపరే, ఓ జములారా పండ్లుఫలహారములు ||సత్యనారాయణా||


కీరు పూరీ చేసీ నైవేద్యముజూపి, 

ఒక్కాపొద్దులు విడువరే, ఓ జనులారా ఒక్కాపొద్దులు విడువరే ||సత్యనారాయణా||


కోరినవారికి, కొడుకులను వరమిచ్చి 

కొటి సంపతి కలుగునే, ఓ జనులారా కొటి సంపతి కలుగునే  ||సత్యనారాయణా||


అడిగినవారికీ 

అధిక సంపతి కలుగునే, ఓ జనులారా అధిక సంపతి కలుగునే ||సత్యనారాయణా||


సత్యనారాయణా స్వామి హారతి పాట - 2
=========


సత్యనారాయణా పూజలుచేసిన

పాపం పరిహారం ఇలలో పాపం పరిహారం ||సత్యనారాయణా|| 


నిరతము, నిను కొలిచినవారికి

ఆశలు తీర్చెదవోదెవా ||సత్యనారాయణా||


పున్నమిరోజున, పుడమిలో జనులు

సత్యనారాయణా పూజలు చేసెదరు ||సత్యనారాయణా||


విష్ణువు నీవే బ్రహ్మవు నీవే మహేశ్వరుడవు నీవే

ఆరాగముతో అనురాగముతో

ఆశలు తీర్చెదవోదేవా ||సత్యనారాయణా||


సత్యనారాయణా స్వామి హారతి పాట - 3

=========


శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మా

మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా ||శ్రీ||


నోచిన వారికి నోచిన వరము

చూసిన వారికి చూసిన ఫలము ||శ్రీ||


స్వామిని పూజించే చేతులే చేతులటా

ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులటా

తన కథ వింటే ఎవ్వరికైనా జన్మతరించునటా ||శ్రీ||


ఏ వేళైనా, ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం

అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం ||శ్రీ||


అర్చన చేద్దామా, మనసు అర్పణ చేద్దామా

స్వామికి మదిలోనే, కొవెల కడదామా

పదికాలాలు పసుపు కుంకుమలు, ఇమ్మని కోరెదమా ||శ్రీ||


మంగళమనరమ్మా, జయమంగళమనరమ్మా 

కరములు జొడించి, శ్రీ చందనమనరించీ 

వందనమనరే సుందరమూర్తికి, వందనమనరమ్మా ||శ్రీ||

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Type text to search
📢 Follow