శీలగునా మారుతీ స్వీకరించు హారతి
పాలనమ్ము చేయరమ్ము
పాదములను జేరితీ
జాలిపడితి మోసపోతి
సమయమిదేనమ్మితి
కాలదూతలాడు కూతలూనుచేయ మరచితి
ప్రాలుమాలతీ, కేలుముగిసితి
పదములనే మ్రొక్కితి
బాలికనై వేడితి ||శీలగునా||
సంగరమున రక్కసులను చాల సృక్కచేసితి
ప్రొంగుచున్, ప్రొంగుచున్ పురమునెల్ల గాంచితిని
సంగాహితుడవై, స్వామిహితుడవై
మంగలంబులొసగుమా
మమ్ము దయన్ గావుమా మా పూజలనందుమా ||శీలగునా||
నీవనంతసాగరగిరి, నిలచిరాజమౌళిని
కావగన్, సెవలన్ని, చేయుచుండువారిని
నీవే బ్రహ్మవు, నీవే హరుడవు, నీవే గొవిందుడవు, నీవెల్లర,గావుమా
మా పూజలనందుమా ||శీలగునా|