వినవమ్మ ఊర్మిళ నా ముద్దు చెల్లెలా
రాముని తమ్ముడమ్మ నా మరిది
రఘు లక్ష్మాణ దేవుడమ్మ నా మరిది || వినవమ్మ ||
రాతి గోవును తెచ్చి రచ్చలోన నిలబెట్టి
పాలు పిండించేనమ్మ నా మరిది
రఘు లక్ష్మాణ దేవుడమ్మ నా మరిది || వినవమ్మ ||
ఏడు ఏడేళ్ళ నాడు ఎండిన గజనిమ్మ
పంట పండించేనమ్మ నా మరిది
రఘు లక్ష్మాణ దేవుడమ్మ నా మరిది || వినవమ్మ ||
గుప్పెడు నువ్వులు భువిలోన వెదజల్లి
రాసులు కట్టెనమ్మ నా మరిది