విజయవాడలో వెలసిన ఓ తల్లీ దుర్గమ్మా
మా పూజలన్నీ గైకొనుమో తల్లీ దుర్గమ్మా
పూలదండలూ గంపకెత్తుకుని దక్షిణ డబ్బులు మూటకట్టుకుని
నరికేళమును చేతబట్టుకుని నీ భక్తులు గుడి చేరెదరమ్మా
పడమదిక్కున వెలసిన నీ గుడి చల్లని వెలుగులు వెలిగే జ్యోతి
వరవడి చేసే కృష్ణ గలగలలు వెండికొండపై వెలసిన దేవి
కోరినవారికి వరములనొసగెడి దీనులపాలిటి పెన్నిధి నీవే
దారి తప్పక శుక్రవారము నీ పూజలు మేము చేసెదమమ్మా
కాంచీపురమున కామాక్షివై మధురానగరిలో మీనాక్షివై
శ్రీశైలంలో భ్రమరాంబవై విజయవాడలో వెలసిన దేవి