ధనధాన్యరాశీ దేవీ భగవతీ
ధన్యోస్మి మాతా ఇదె గొనుము జోతా
అనురాగప్రేమమూర్తి నీవేనమ్మా ఎనలేని సౌభాగ్య దుర్గాలమ్మా
నిను నమ్మి కొలిచినా తనయుండనమ్మా అనయము చల్లగా చూడుమా
పుష్పబాణధారి ఓ జగదాంబిక రక్ష నీవే కావా కుంకుమచంద్రిక
లక్ష్మీ పార్వతీ సరస్వతీముఖీ దాక్షాయణి ధర్మ ఏలికా
తక్షణం నీ దయే చూపిక
వేదమంత్రపుష్ప నమస్కారిణీ వింధ్యపర్వతాల ఓ మునివేషినీ
చందనకర్పూర సాంబ్రాణిధూపిణీ చంద్రోదయాకాంతికామినీ
ఇంద్రలోకాధిపా పావనీ
స్వర్ణ మంగళాయి ఓ శుభగామినీ సర్వదుఃఖహేతు జనసంరక్షిణీ
సహస్ర పేరులా కాళీస్వరూపిణీ సేవింతు రాము కవి పావనీ
సద్గతి చూపు కాత్యాయనీ